Breaking News

సత్యధర్మ రక్షకా జయం జయం రవిదాసా - Sant Ravidas Songs in Telugu

రచన - అప్పాల ప్రసాద్

సత్యధర్మ రక్షకా... జయం జయం రవిదాసా॥

భక్త పరిపాలక -- జై జై గురు రవిదాసా 


భారతీయ జీవనం - ఆగనిది ఈ యజ్ఞం 

సత్యం సనాతనం -  శాశ్వతం ఈ మార్గం 


1. లోకమంత ఎదురొచ్చిన 

లోబడను ఎవ్వరికి..

ప్రాణాలకు ముప్పువస్తె 

విడువను ధర్మమెప్పటికీ!

కత్తులు ఝలిపించినా 

భయపడను ఎన్నటికి 

సముద్రంలో  ముంచినా 

నిజం మరువనెప్పటికీ ॥

సత్యధర్మ రక్షకా... జయం జయం రవిదాసా॥

భక్త పరిపాలక -- జై జై గురు రవిదాసా 


2. దేహం నశియించినా

ధర్మమే నిలిచేది..

వేదం నా మూలము 

జ్ఞానమే శాశ్వతమని 

వేదం నా వెలుగు బాట 

విమలం నా జ్ఞాన గంగ

సత్యపథము విడువలేను

ధర్మ మనుసరించవలెను ॥

సత్యధర్మ రక్షకా... జయం జయం రవిదాసా॥

భక్త పరిపాలక -- జై జై గురు రవిదాసా 


 3. స్వర్గసుఖం నే కోరను 

భోగముపై ఆశ లేదు 

సత్యధర్మ సేవలోనే

నా జన్మ ధన్యమగును 

రవిదాసు చూపిన 

ఈ బాటలోనే నడుస్తా 


సత్యధర్మ రక్షకా... జయం జయం రవిదాసా॥

భక్త పరిపాలక -- జై జై గురు రవిదాసా

No comments