Breaking News

గురుదేవ రవిదాసా హరి హరి బోలో - Sant Ravidas Songs in Telugu

రచన - అప్పాల ప్రసాద్


గురుదేవ రవిదాసా - హరి హరి బోలో 

నరహరి గోవిందా -హరి హరి బోలో …


నరహరి! నాపైన నీ దయ చూపరా 

నా మనసును నీవే నియంత్రించరా 

అహంకార మమకారం తొలగించరా 

అంతరంగమందు నిలిచి కాపాడరా॥


గురుదేవ రవిదాసా - హరి హరి బోలో 

నరహరి గోవిందా -హరి హరి బోల్…


నిలకడ లేకుండ తిరుగు మనసే నాది 

మాయమోహజాలములో  చిక్కినది 

నీ నామం నే జపించు జీవన మార్గం 

నీ పాదసేవయే నా పరమానందము॥


గురుదేవ రవిదాసా - హరి హరి బోలో 

నరహరి గోవిందా -హరి హరి బోలో …


ప్రతి హృదయమునందు నీవు నిత్యవాసివి

ప్రతి జీవమునందు  నీవు పరమజ్యోతివి అజ్ఞానపు తెరలన్నీ - తొలగించుమురా 

భక్తి నింపి ప్రేమతోడ  నడిపించుమురా ॥


గురుదేవ రవిదాసా - హరి హరి బోలో.

నరహరి గోవిందా - హరి హరి బోలో …


నాలోని సద్గుణాలు నీవే - ఓ స్వామి 

నాలోని దోషాలు నావే -- ఓ స్వామి 

దయాసాగరా స్వామి కరుణాకరా

నీ నిజరూపము నాకు చూపించరా ॥


గురుదేవ రవిదాసా - హరి హరి బోలో 

నరహరి గోవిందా -హరి హరి బోలో …


రవిదాసు పలికినట్టి భక్తిమార్గమిదేరా 

రామకృష్ణ హరినామం భక్తి సారమిదేరా 

సమదృష్టిని నా లోన కలిగించుమురా 

నీ చరణములే - నాకు శరణాగతిరా ॥


గురుదేవ రవిదాసా - హరి హరి బోలో 

నరహరి గోవిందా -హరి హరి బోలో

No comments