Breaking News

Sanchara Jatula Song Lyrics - సమర యోధులారా సంచార జాతులారా

రచన - అప్పాల ప్రసాద్

సమర యోధులారా - సంచార జాతులారా జోహార్ మీ పట్టుదలకు -జోహార్ మీ నిబద్దతకు 

స్వాతంత్ర్యం జన్మ హక్కు విముక్తికై పోరు సల్పు 

సమర యోధులారా - సంచార జాతులారా

రణ రాణా ప్రతాపుని యుద్ధ తంత్ర వ్యూహంతో 

భిల్లులు, గడి లోహార్లు అక్బరునెదిరించిరి 

రాణా రణ గాథలన్ని ప్రజలకు వివరించిరి 

చిత్తోడ్ కి స్వాతంత్ర్యం వచ్చువరకు నిద్రించక

స్వాభిమాన సంచారులు స్థిరవాసం వదలిరి.

సమర యోధులారా - సంచార జాతులారా జోహార్ మీ పట్టుదలకు -జోహార్ మీ నిబద్దతకు

గెరిల్లా దాడులతో భిల్లులు గాండ్రించిరి 

మొఘలాయిల దెబ్బగొట్టి రాణా కండ నిల్చిరి 

అడవిలోన దారి జూపి,ఆహారం సమకూర్చిరి 

అడుగడుగున ధర్మానికి రక్షకులై నిల్చిరి 

పుంజా భిల్ వీరత్వం బాటలోన నడిచిరి 

సమర యోధులారా - సంచార జాతులారా జోహార్ మీ పట్టుదలకు -జోహార్ మీ నిబద్దతku

ఔషదాల తయారీతో చితోడియా సంచారులు 

సైనికుల ప్రాణాలను వైద్యంతో కాపాడిరి

రేయనక పగలనక ఆయుధాల తయార్జేసి

ఛత్రపతి సైన్యానికి ఖడ్గాలందించిరి 

గడి లోహార్లెప్పుడూ శివాజికి తోడుండిరి...

సమర యోధులారా - సంచార జాతులారా జోహార్ మీ పట్టుదలకు -జోహార్ మీ నిబద్దతకు

వాసుదేవ బలవంత ఫడ్కే నేత్రుత్వంలో 

అడుగడుగున ఆంగ్లేయులనడ్డగించి పోరుజేసి,

సంచారు లచంచలంగ త్యాగ నిరతి చూపించిరి

ఆంగ్లేయుల చేత చిక్కి ప్రాణాలే అర్పించిరి

సంచారుల వీరగాథ చరిత్రలొ లిఖించిరి

సమర యోధులారా - సంచార జాతులారా జోహార్ మీ పట్టుదలకు -జోహార్ మీ నిబద్దతకు

పట్టిన పట్టును వదలని - ప్రలోభాలకే లొంగని  

వీర విహారులు వీరు త్యాగ ధనులు మనవారే 

స్వరాజ్య సమరంలొ సమిధలైరి సంచారులు 

చరిత్ర పుటలలో అంతు పట్టనదృశ్యులు 

సమర యోధులారా - సంచార జాతులారా జోహార్ మీ పట్టుదలకు -జోహార్ మీ నిబద్దతకు

No comments