Breaking News

శంకరుడెక్కిన బసవన్నా డూ డూ బసవన్నా- Gangireddula Song Lyrics

రచన - అప్పాల ప్రసాద్


శంకరుడెక్కిన బసవన్నా- డూ డూ బసవన్నా -

గలగల గజ్జెల గంతులు వేసె - గంగిరెద్దులన్నా


సంకురాతిరి పండుగ వేళ సంబరాలతో చుట్టాలొచ్చె

సంచారాలే సాగుతు వుంటే - సందడి చేస్తూ బసవన్నోచ్చే -

ఇంటింటా కనువిందులు జేస్తూ - చెంగు చెంగునా దూకిండన్నా

ఇంపు సొంపుగా నడుములూపుతూ - గిట్టల శబ్దం చేసిండన్నా


శంకరుడెక్కిన బసవన్నా- డూ డూ బసవన్నా -

గలగల గజ్జెల గంతులు వేసె - గంగిరెద్దులన్నా


ఇంటింటా దర్శనమిస్తూ

సన్నాయిరాగం వినిపిస్తూ 

గంగిరెద్దులే ముందుకు వంగి

దీవెనలిచ్చి ముందుకు సాగె

గంగిరెద్దుల వాళ్లంతా -నందీశ్వరుని నడిపించి

విన్యాసాలే చేయిస్తూ - సంభావనలె పొందిరయా -


శంకరుడెక్కిన బసవన్నా- డూ డూ  బసవన్నా -

గలగల గజ్జెల గంతులు వేసె - గంగిరెద్దులన్నా


ఆకలి కేకల మెతుకులకోసం -కళా రూపమై కదిలింది

ప్రజా రంజకం గావిస్తూ - పల్లె పల్లె తిరుగాడింది

వినసొంపైన పురాణకథలు -విప్పి చెప్పిరి వినరండీ

గంగిరెద్దుల వాళ్లంతా - సంప్రదాయ సారథులండి


శంకరుడెక్కిన బసవన్నా- డూ డూ  బసవన్నా -

గలగల గజ్జెల గంతులు వేసె - గంగిరెద్దులన్నా

మెడలో గంటలు మోగుస్తూ - చిందులేసెరన్నా

నందీశ్వరుడే రంకెలు వేస్తూ దుముకు దుంకెరన్నా

No comments