Breaking News

సంచార జాతుల పాట - Sanchara Jathula Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


తర తరాలుగా సంచారార్థ సంచారం విముక్తజాతుల ప్రేరణ చిత్రం

అరవైతొమ్మిది తెగలై ఎగసిన స్వతంత్రయోధుల ధీర చరిత్రం

ప్రకృతి బిడ్డల,స్వేచ్చాజీవుల సంచారుల జన జీవన గమనం 

అణిచివేత అన్యాయం దోపిడి చేసిన విదేశిమూకల తరుమగ శతాబ్దాల సంఘర్శణ తత్వం

నిరాడంబరం కపట రహితులు సద్గుణ సంపద స్నేహశీలురు 

సంప్రదాయ,ఆచార సంస్కృతిని ఆచరించి జన మానసవీధుల స్ఫూర్తినింపుతూ కదలిన ఘట్టం 

భారతీయతకు అద్దం పట్టిన  చిత్ర విచిత్రపు నామధేయముల సంచారులు మనవారే....


చిందుమందులెరుకల జోషి కాటిపాపల 

గంజికూటినక్కల మరాఠి జోషినందుల 

మొండిబండ మొండిపట్ట కృష్ణబలిజరెడ్దిక 

గంగిరెద్దుబాలసంతువంశరాజుదాసరి 


వీరభద్ర బేడబుడగజంగంయానాదుల 

గంగిరెద్దుబుడబుక్కల డక్కలి పెద్దమ్మల  

బహురూపిపంబాలపాములరాజన్నల 

బాగోతులపార్థిపట్ర సిక్ లిగార్ పూసల 


వాల్మీకీబోయ రెల్లి కైకాడి ఓడ్ యాట కాటిపాప 

వడ్డెర మేదరి పూసల సురభి ఆరె మరాఠీ 

రామజోగి గోసంగి హోలియదాసరి కాసికాపుడి 

పాండవుల తెర చీరలు గౌడజెట్టి బొత్తుల 


ఆదికొడుకు కాకిపడగ దొమ్మర బైల్ కమ్మర 

కూనపులి సన్నాయిల సాధనశూరుల గోత్రాల్  

పరికిముగ్గు కంజరబట్ట ఏనుంటి  పకీరులు,

పటమద్దంబొమ్మలాట గుర్రపు మసాయిలు


నిరాడంబరం కపట రహితులు సద్గుణ సంపద స్నేహశీలురు  

భారతీయతకు అద్దం పట్టిన  చిత్ర విచిత్రపు నామధేయముల సంచారులు మనవారే...

No comments