జ్వలించే అగ్నిగుండం కుంరం భీమ్ - Kumaram Bheem Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
జ్వలించే అగ్నిగుండం - కుంరం భీమ్
నిజం నిగ్గు తేల్చే - కుంరం భీమ్
ధ్వనించే ధిక్కార స్వరం - కుంరం భీమ్
నిజాము సింహస్వప్నం- కుంరం భీమ్
మావ నాటే - మావ సాటే నినాదం -కుంరం భీమ్
జోడేఘాట్ లో అమరుడయ్యే కుంరం భీమ్
ధీరులం యోధులం వీరులం శూరులం
చెట్టు చెరువు పుట్ట గుట్ట ప్రకృతి ఆరాధకులం
మానవత్వ పరిమళాలు వెదజల్లే పువ్వులం
కోలామ్, గోండు, ఆంధ్,తోటి,
పరధాన్, నాయక్ పోడులు,
కోయ, చెంచు,గుత్తికోయ,కొండరెడ్లమందరం
అడివి,భూమి,జంతు,జలం కాపాడే బిడ్డలం
తుడుం దెబ్బ చప్పుల్లతో , కదంత్రోక్కి కదలినం
జంగు లింగు పుత్రులం - లక్ష్మి దేవర తమ్ములం
గాంధారి, మైసమ్మ ల దేవతలే కొలిసినం
పాండవ వంశాన పుట్టి,భీమదేవుని గుడి కట్టి
రావి, మర్రి,వేప,తులసి చెట్లను ఆరాధించి
అడవీ ఉత్పత్తులమ్మి- జీవనమే సాగించి
తర తరాల సంప్రదాయ సంస్కృతికి సారథులం
భాష,యాస, కట్టు,బొట్టు కాపాడే సైనికులం
ధీరులం,యోధులం,వీరులం,శూరులం
చెట్టు, చెరువు, పుట్ట,గుట్ట, ప్రకృతి ఆరాధకులం
మానవత్వ పరిమళాలు వెదజల్లే పువ్వులం
కలశాలు చేతబట్టి - కాలినడక బాట పట్టి
గోదారి నీళ్లు తెచ్చి- ఇంద్రాణి పూజ చేసి
మర్రి చెట్టు పుట్ట మట్టి దాటి ఆవు పాలు తెచ్చి
ఆది శేషుకందించే - నాగోబా జాతరా
నలుదిక్కుల గంతులేసే - కేస్లాపూర్ జాతర
సమ్మక్క,సారలక్క,తూలు ముత్తి వేల్పులకు
తరలి వచ్చే భక్త జనం -చిందులేసే జాతర
ధీరులం యోధులం వీరులం శూరులం
చెట్టు చెరువు పుట్ట గుట్ట ప్రకృతి ఆరాధకులం
మానవత్వ పరిమళాలు వెదజల్లే పువ్వులం
వీరాంగన దుర్గావతి - ఫూలో,ఝానో ముర్ము
ప్రజల రాణి గైడిన్లు - సాయుధ బిర్సా ముండా
నీలాంబర్,పీతంబర్ - హైపో జాదో నాంగులు
బుధు భగత్,తిలక మాంజి,రాంజీ గోండ్,భిల్లులు
దేశంకై పోరుసల్పిన - స్వతంత్ర సమర యోధులు
ధీరులం యోధులం వీరులం శూరులం
చెట్టు చెరువు పుట్ట గుట్ట ప్రకృతి ఆరాధకులం
మానవత్వ పరిమళాలు వెదజల్లే పువ్వులం
No comments