దాసరంటే దాసరి హోలియ దాసరి - Holiya Dasari Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
దాసరంటే దాసరి - హోలియ దాసరి
లక్ష్మీ నర్సింహాస్వామి చరణ దాసరి
హరినామ సంకీర్తన
ఆలయాన భజనలతో
ధార్మిక సేవలు చేసే
వైష్ణవ ఆరాధకులు
దాసరంటే దాసరి - హోలియ దాసరి
లక్ష్మీ నర్సింహాస్వామి - చరణ దాసరి
బుద్దారెడ్డి రచియించిన
రంగనాథ రామాయణం
కావ్యం ఆధారంగా
బాగోతాల్ ప్రదర్శించె
దాసరంటే దాసరి - హోలియ దాసరి
లక్ష్మీ నర్సింహాస్వామి చరణ దాసరి
సుభద్రా పరిణయం
కృష్ణ తులాభారము
ప్రహ్లాద లవకుశలు
పౌరాణిక కథల్ చెప్పె
దాసరంటే దాసరి - హోలియ దాసరి
లక్ష్మీ నర్సింహాస్వామి చరణ దాసరి
వైష్ణవాచార్యులైన
రామానుజ దారిలొ
వీర శైవ బుడగజంగ
ఆటపాట బాట నడిచె
దాసరంటే దాసరి - హోలియ దాసరి
లక్ష్మీ నర్సింహాస్వామి చరణ దాసరి
శ్రీ కృష్ణ తత్వాన్ని
వీర శైవ కథనాల్ని
జాతీయత భావాన్ని
చాటి చెప్పి సాగినట్టి
దాసరంటే దాసరి - హోలియ దాసరి
లక్ష్మీ నర్సింహాస్వామి చరణ దాసరి
రామాయణ భారతం
వినసొంపుగ చెప్పినోళ్లు
బొట్టు బిళ్ల,బొమ్మలమ్మి
దీనంగా బ్రతుకులీడ్చె
దాసరంటే దాసరి - హోలియ దాసరి
లక్ష్మీ నర్సింహాస్వామి చరణ దాసరి
No comments