స్వాతంత్ర్యం జన్మ హక్కు సాధించగ సంచారులు - Swatantryam Janma Hakku Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
స్వాతంత్ర్యం జన్మ హక్కు
సాధించగ సంచారులు
స్వరాజ్య సమరంలో
సమిధలైరి తెలియరా
సంచార జాతు లర్థ - సంచార జాతులు
అణిచివేతనణచివేసే విముక్త జాతులు
పుట్టుకతో ముద్ర వేసె నేరస్తుల చట్టాలను
కూకటి వ్రేళ్ళతొ కూల్చిన డిఎన్టీ జాతులు
స్వాతంత్ర్యం జన్మ హక్కు
సాధించగ సంచారులు
స్వరాజ్య సమరంలో
సమిధలైరి చూడరా
భారత స్వాతంత్ర్య పోరు సాగించిన యోధులు
ఆంగ్లేయుల తరిమికొట్ట ఝలిపించిరి కత్తులు
నేతాజీ ఆజాద్ హిందు పౌజ్ సైనికులై
అండమాన్ దీవులపై ఎగరేసిరి జయ పతాక
స్వాతంత్ర్యం జన్మ హక్కు
సాధించగ సంచారులు
స్వరాజ్య సమరంలో
సమిధలైరి చూడరా
రాణా - శివ సైన్యానికి ఆయుధాలనందించి
బైల్ కమ్మరీ జాతులు చేసిరి మహ - ఉపకారం
బ్రిటిషోళ్ళ ఆయుధాలు గిరిజనులె కొల్లగొట్టి
నిరంకుషపు చట్టాలను తగుల బెట్టి ఎదిరించిరి
స్వాతంత్ర్యం జన్మ హక్కు
సాధించగ సంచారులు
స్వరాజ్య సమరంలో
సమిధలైరి చూడరా
తెల్లదొరలు అక్రమంగ దోపిడి చేసిన సొమ్మును
వేగంగా దాడి చేసి,సొమ్మునంత దోచుకుని
చీకట్లో మాయమయ్యే భారతీయ శూరులు
అడుగడుగున ఆంగ్లేయుల అడ్డగించే ధీరులు
స్వాతంత్ర్యం జన్మ హక్కు
సాధించగ సంచారులు
స్వరాజ్య సమరంలో
సమిధలైరి చూడరా
కఠినమైన చట్టాలతో గిరిజనులను బంధించి
చీకటి కొట్లలో ఉంచి,చిత్ర హింస పాల్జేసిరి
వేలాది కుటుంబాలు తిరిగే సంచారులైరి
ఆంగ్లేయుల పాలనలో నరకమనుభవించిరి
స్వాతంత్ర్యం జన్మ హక్కు
సాధించగ సంచారులు
స్వరాజ్య సమరంలో
సమిధలైరి చూడరా
శివ రాణా నేతాజీ వాసుదేవ్ సహచర్యం
గుండెనిండ ధైర్యముండి మొండిపట్టు సాహసం
ఆగస్టు ముప్పయొకటి విముక్తులై పిడికిలెత్తి
దేశభక్తి పొంగులెత్త జై హిందని గర్జించిరి
స్వాతంత్ర్యం జన్మ హక్కు
సాధించగ సంచారులు
స్వరాజ్య సమరంలో
సమిధలైరి చూడరా
No comments