Breaking News

దీనులైన సంచార జాతులకు - Sanchara Jatula Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


దీనులైన సంచార జాతులకు

రాజ్యాంగం ఫలములేవీ?

స్వాతంత్య్రమొచ్చింది ఇన్నేళ్లు గడిచినా

కన్నీళ్లు తుడిచెవారేరీ?

ఓదార్చు వారు ఏరి  ?

గోడువిను నాథులేరి ?॥


పల్లెలో పట్టణంలో

పూరి గుడిసె బ్రతుకులాయే

స్వంత ఇళ్లు లేక

వీధులందు తిరుగుడాయే

ఆధార్ కార్డు

ఇవ్వరాయె 

కులం గుర్తింపు

ఇవ్వరాయె 

బ్రతికి వున్నా గాని 

చిరునామా లేదాయె


దీనులైన సంచార జాతులకు

రాజ్యాంగ ఫలములేవీ?

కన్నీళ్లు తుడిచె వారేరీ?॥


బడి మాని పసిబిడ్డ

రోడ్డు పాలయెనా

పుస్తకాలు విడిచి

పనులలో మునిగెనా

కోటి విద్యలు కూటికని

ఊరూరా తిరిగేనా

కన్నీటి కాలాన

కన్నకలలు కల్లలాయేనా 


దీనులైన సంచార జాతులకు

రాజ్యాంగం ఫలములేవీ?

కన్నీళ్లు తుడిచె వారేరీ?॥


మైళ్ళు మైళ్ళు నడిచి

త్రాగు నీళ్లు తెచ్చుడాయే

దవఖానాలు దూరమై

రోగాలతో నడుచుడాయె 

శుచి శుభ్రం లేనెలేదు 

చెత్తలోనే బతుకుడాయె

మరుగు దొడ్లు లేక

దోమలకు నెలవాయే ,

గూడు కోరినా గాని

గుడిసెలోన మగ్గుడాయే ॥


దీనులైన సంచార జాతులకు

రాజ్యాంగం ఫలములేవీ?

కన్నీళ్లు తుడిచె వారేరీ?


సర్కారు పథకాలు

వివరించె వారేరి ?

సబ్సిడీ ఋణాలు

అందించు వారేరి ?

ఉపాధి లేకున్నా 

ఆదాయమే సున్న

బహువేషధారులై

భిక్షాటనం మిగిలెనన్న ॥


దీనులైన సంచార జాతులకు

రాజ్యాంగ ఫలములేవీ?

కన్నీళ్లు తుడిచె వారేరీ?॥


కళలందు నిపుణులే

పోషించేదెవరు

బొమ్మలమ్మి బతికినా 

ఆదరించేదెవరు

చేయూత లేకనే 

బ్రతుకు బండి ఆగిపోయే 

నలుమూల తిరిగినా

గౌరవమె దక్కదాయే 

అసమానతలే పెరిగి

దూరముంచేరయా


దీనులైన సంచార జాతులకు

రాజ్యాంగ ఫలములేవీ?

స్వాతంత్య్రమొచ్చింది ఇన్నేళ్లు గడిచినా

కన్నీళ్లు తుడిచె వారేరీ?


ఇళ్లేవి? బళ్లేవి? 

త్రాగు నీళ్లేవి?

తారురోడ్డులేవి?

అభివృద్ధి పనులేవి?

అధికార్లనడిగితె

దరికి రానివ్వరు 

మారు పల్కక వుంటే 

పనులసలె చెయ్యరు 

రాజ్యాంగ హక్కుల్ని

అణిచి వేసేదెవరొ ?

అడుగడుగున అడ్డుతగిలి

ఆక్షేపించేదెవరొ?

తెలివిగా పనులన్నీ 

చక్కదిద్దాలంటే 

సదువుకుని ముందుండి 

సమస్యలే తెలియాలి 

సంచారులందరూ

కలిసి కట్టుగుండాలె 

హక్కులు సాధించేందుకు 

పోరాటం చెయ్యాలె 


దీనులైన సంచార జాతులకు

రాజ్యాంగ ఫలములేవీ?

స్వాతంత్య్రమొచ్చింది ఇన్నేళ్లు గడిచినా

కన్నీళ్లు తుడిచె వారేరీ?

No comments