Breaking News

యుగ యుగాల భరతమాత పుత్రులం పవిత్రులం - Yuga Yugala Bharata Mata Song Lyrics in Telugu

 రచన, గానం - అప్పాల ప్రసాద్ గారు
సంగీతం - రాజా
 
 
 
 
 

పల్లవి

యుగయుగాల భరతమాత పుత్రులం పవిత్రులం 
నరనరాన దేశభక్తి పొంగులెత్తు శక్తులం    || యుగయుగాల భరతమాత ||


చరణం : 1
ప్రళయ ఝంఝ మారుతం - హైందవం మహాధ్బుతం 
జగతిలో మహోన్నతం - ధర్మజనుల భారతం 

అజేయ యోగ శక్తిరా...
అజేయ యోగ శక్తిరా....
అభేద్య భరత ధాత్రిరా 
శత్రుమూక చుట్టుముట్టె  మట్టుబెట్టు సైనికా     || యుగ యుగాల ||

చరణం : 2
గాండివం,సుదర్శనం 
భవాని ఖడ్గ ధారులం
ఇనుపకండరాలు,ఉక్కు నరాలున్న యువకులం
స్వతంత్ర సమర హోమాగ్నిలో సమిధలం,యోధులం 
స్వర్ణ చరిత పుటలలో - అఖండ కీర్తి ధాములం
జ్ఞాన శీలవంతులై...
జ్ఞాన శీలవంతులై...
హనుమ భీమ బంటులై 
ధర్మ రక్ష దీక్ష మనది - ఆగకుండ సాగుదాం    || యుగ యుగాల ||

చరణం : 3
హిందుసంద్ర హిమనగం 
గంగ సింధు సాగరం...
ధీర గంభీర జలధి నిత్య స్పూర్తిదాయకం....
గ్రీకు హూణ శక కుషాణు లణచినావు భూసుతా....
మొఘలు ఆంగ్ల దొరల మెడలు వంచినావు ధీరుడా.. 
అడుగడుగున విజయమే...
అడుగడుగున విజయమే....
ఆగదీ ప్రభంజనం...
దేశధర్మ రక్షణకై సాగుతోంది జనపదం   || యుగ యుగాల ||

చరణం : 4
హిందుసైన్య తాండవం 
ప్రళయ కాల గర్జనం 
ఫణవ, భేరి, శంఖనాద, తాళ యోగ ఘోషణం...
పదం పదం భుజం భుజం - సంచలనం ధరాతలం...
త్రివిక్రముల్ త్రిలోకముల్ - నిలిచె హిందువైభవం... 
మడమ త్రిప్పవద్దురా....
మడమ త్రిప్పవద్దురా.....పిడికిలి బిగియించరా.. 
దుశ్శాసన దుర్మార్గుల తరిమి తరిమి కొట్టరా    || యుగ యుగాల ||

1 comment:

  1. యుగ యుగాల భరతమాత పుత్రులం పవిత్రులం

    ReplyDelete