Breaking News

ఇదే భారత దేశం సకల సంపద నిలయం - Ide Bharata Desam Song Lyrics in Telugu


 

ఇదే భారత దేశం సకల సంపద నిలయం
ఇదో పుణ్య ప్రదేశం ఇదే దేవాలయం

ఇతిహాస వేద ఘోషలు వినిపించు విశ్వ గీతం
సత్య ధర్మ శాంతి ప్రేమలొలుకు పరమ చరితం
త్యాగ నిరతి కేతనాలు ఎగిరెను ఈ గాలిలొ
సమత మమత సౌశీల్యం పారెను సెలయేటి లా
ఈ నేల గాలి నీరు చందనం హరి చందనం
|| ఇదే భారతదేశం ||

 
ఈ దేశం ఈ దేహం అద్వైతం మా భావం
మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సింధూరం
వీరత్వపు జ్వాలలెగిసి రగిలిన ఈ ధూలి లో
జాతి కీర్తి గీతి కట్టి వినిపించెను వినువీధిలో
మాలోని అణువణువు అర్పితం సమర్పితం
|| ఇదే భారతదేశం ||

 
నర్తన సంకీర్తన సహిత్య క్షేత్ర పరిమళాల
నీయతేనీయ జల్లుల పులకరించె ఈ నేల
భక్తి శక్తి యుక్తుల పరమార్థం బోధించెరా
జగద్గురువు తానై జగమంత వెలుగునింపెరా
ఈ పుణ్య భూమి పుత్రులందరం ధన్యజీవులం || ఇదే భారతదేశం ||

2 comments:

  1. ఇదే భారత దేశం సకల సంపద నిలయం
    ఇదో పుణ్య ప్రదేశం ఇదే దేవాలయం

    ReplyDelete