Breaking News

దీపావళి గురించి - About Deepavali in Telugu

 

 


స్త్రీల స్వేచ్చ ను హరించిన నరకాసురుడిని వధించి, సత్యభామా కృష్ణులు ఙ్ఞాన దీపాన్ని వెలిగించిన దీపావళిని ఘనంగా జరుపుకుందామా! పండుగ లోని కథల వెనక వున్న పరమార్థం తెలుసుకుందామా!
 
భూదేవి మరియు విష్ణుమూర్తి అవతారం అయిన వరాహస్వామి ల కొడుకు నరకుడు. ప్రాగ్జొతిషపురం( హిమాలయములలో ) యొక్క అధిపతి గా 16000మంది స్త్రీలను చెరబట్టిన కర్కశుడు.దేవతలను హింసించాడు. ఈ భూమికి రాజైన నరకాసురుడు స్త్రీలకు స్వాతంత్య్రం ఇవ్వక హింసించడాన్ని సహించక సత్యభామ,శ్రీ కృష్ణుడు కలిసి వెళ్లి,సంహరించి స్త్రీలను విడుదల చేసారు.సమాజం లో వారికి ఉన్నత స్థానం, గౌరవం కల్పించడానికి తనను భర్త గా భావించమని సలహా ఇస్తాడు. శ్రీ కృష్ణ భగవానుడు సమాజ సుధాకరుడిగా పేరు పొందాడు. భూదేవి అవతార స్వరూపం సత్యభామ తప్పు చేసిన తన కొడుకునే సంహరించటం వల్ల స్త్రీలకు స్వేచ్చ ను ప్రసాదించిన రోజు నే నరక చతుర్డశి, దీపావళి గా జరుపుతున్నారు. 
 
అయినప్పటికి కంచ ఐలయ్య,స్వారో సుప్రీం ప్రవీణ్ కుమార్IPS దళితులను ముఖ్యంగా గురుకుల విద్యాలయాల్లో తప్పుదారి పట్టించే చరిత్ర కథలు చెప్పి, క్రైస్తవ మిషనరీల డబ్బుతో హిందువులు గా వున్న షెడ్యూల్డ్ కులాల,తెగల వారిని ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల వలలో పడేసి, స్త్రీలను ఎత్తుకొచ్చి అత్యాచారాలు చేసే రావణుని,నరకుని పూజించే స్థాయికి దిగజారుస్తున్నారు. రావణుడు ,నరకుడు దళితులు కాదు, (ఒకరు బ్రాహ్మణుడు, మరొకరు భూదేవి పుత్రుడు) దక్షిణాది వారు కాదు (ఇద్దరు ఉత్తరాది వారే) ఐలయ్య దళితుడు కాదు (క్రైస్తవ మతం లో కి మారిన కురమ) ప్రవీణ్ కుమార్ దళితుడా? (తల్లిదండ్రులు మాత్రం క్రైస్తవులు). కాని ఈ బృందం తెలంగాణ లో పెద్ద ఎత్తున SC లను టార్గెట్ చేసుకుని రెచ్చ గొట్టే ప్రసంగాలు,వీడియోలు,మెస్సేజ్ లు,పుస్తకాలు పంపిణీ చేస్తూ, ప్రభుత్వ అధికారం దుర్వినియోగం చేస్తూ ప్రజలను కలిపి వుంచవలసింది పోయి, కులాల వారిగా విభజించి సమాజానికి హాని కలిగిస్తూ , హిందువుల పండుగలను,దేవీ దేవతలను తిడుతూ,SC లను హిందూ సమాజానికి దూరంగా జరిపే పనిలో క్రియాశీలకంగా వున్నారు. 
 
పండుగలలోని పరమార్థం అర్థం చేసుకోకుండా కోట్లాది ప్రజల మనోభావాలు గాయ పరుస్తున్నారు.
దీపావళి ప్రాముఖ్యం తెలిపే అంశాలు:
1.వామనుడు బలితల పై పాదం మొపిన రోజు
2. శ్రీ రామ పట్టాభిషేకం దినోత్సవం
3.నరకుడి ని వధించిన దినం
4.విక్రమార్క పట్టాభిషేకదినోత్సవం
5.జైన మహా వీరుని వర్ధంతి
6.ఆయుర్వెద పితామహుడు ధనవంతరి జయంతి
7.లక్ష్మీదేవి ఆరాధన, పిత్ర దేవతల ఆరాధన , దీపారాధన ద్వారా మనిషి లోని అజ్ఞాన అంధకారాలను తొలగించి, జ్ఞానంవైపు నడవమని చెప్పే దివ్యమైన పర్వం. ప్రపంచంలోని ఎన్నో దేశాలలో అమెరికా,సింగపూర్ వంటి దేశాలలో ఘనంగా జరిపే ప్రభావితమైన పండుగ. 'తమసోమా జ్యోతిర్గమయా 'అని ఉపనిషత్తుల సందేశపు పండుగ దీపావళి.
 
 - అప్పాల ప్రసాద్..

1 comment:

  1. స్త్రీల స్వేచ్చ ను హరించిన నరకాసురుడిని వధించి, సత్యభామా కృష్ణులు ఙ్ఞాన దీపాన్ని వెలిగించిన దీపావళిని ఘనంగా జరుపుకుందామా! పండుగ లోని కథల వెనక వున్న పరమార్థం తెలుసుకుందామా!

    ReplyDelete