వివేకానందుని దృష్టిలో భారతీయ మహిళ - Swami Vivekananda about Indian Women in Telugu
మహిళల గురించి భారతీయుల, పాశ్చాత్యుల ఆలోచనలో చాలా తేడా ఉంది. వారివారి జీవన విధానాన్ని బట్టి ఈ తేడాలు వచ్చాయి. భారత దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం, ఆమె ఎదుర్కొం టున్న సమస్యల గురించి స్వామి వివేకానంద అనేకసార్లు ప్రస్తావించారు. వారి ఉపన్యాసాల్లో చెప్పిన అనేక ముఖ్య విషయాలను చూద్దాం..
ప్రతి దేశంలో స్త్రీ, పురుషులు తెలిసో, తెలియకో ఒక ఆదర్శాన్ని
అనుసరిస్తుంటారు. ఆ ఆదర్శం వ్యక్తుల ద్వారానే తెలుస్తుంది. వ్యక్తుల సమూహమే
దేశం. దేశం ఒక మ¬న్నతమైన ఆదర్శాన్ని మన ముందుంచుతుంది. కాబట్టి ఏ
దేశాన్నైనా అర్థం చేసుకోవాలంటే ఆ దేశపు ఆదర్శం ఏమిటో తెలుసుకోవాలి. ఆ
ఆదర్శాన్ని బట్టి ఆ దేశపు జయాపజయాలను అంచనా వేయాలి. అభివృద్ధి, పురోగతి,
సుస్థితి, పతనం అనేవి ఆదర్శాన్ని బట్టి నిర్ణయమవుతాయి. ఒక దేశంలో మంచిదని
భావించే అంశం మరో దేశంలో మంచి కాక పోవచ్చును. కాబట్టి ఒక దేశస్థుల
గుణదోషాలను వేరే దేశపు ప్రమాణాలను బట్టి నిర్ణయించకూడదు.
ఆదర్శ భారతీయ మహిళ సీత
సీతారాములు భారతీయులకు ఆదర్శప్రాయులు. బాలికలు సీతను ఆరాధిస్తారు.
పవిత్రురాలు, భక్తురాలు, సహనశీలవతి అయిన సీతాదేవిని అనుసరించాలని ప్రతి
భారతీయ మహిళ కోరుకుంటుంది. సీతాదేవి గురించి మాట్లాడు తున్నప్పుడు
భారతీయుల, పాశ్చాత్యుల ఆదర్శాల్లో తేడా ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది.
‘చేతల్లో శక్తిని చూపించాలి’ అని అంటారు పాశ్చాత్యులు. ‘సహనంలో శక్తిని
చూపాలి’ అంటారు భారతీ యులు. ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా, ఎంత ఎక్కువ సంపద
కూడబెట్టవచ్చో పాశ్చాత్యులు చూపితే, సంపదను ఎంతగా త్యాగం చేయవచ్చో భారతీ
యులు చూపారు. సీతాదేవి భారతీయులకు ఎందుకు ఆదర్శం అయింది? ఆమె క్షమాశీలి.
పరమసాధ్వి. దుర్భర కష్టాలను కూడా చిరునవ్వుతో భరించింది. తమ వంతు
కర్తవ్యాన్ని నిర్వర్తించింది. కష్ట సమయంలో కూడా భర్త సేవను విడనాడలేదు.
అందుకే సీత భారతీయులందరికీ ఆదర్శం. మేమంతా సీతమ్మ బిడ్డలం. భారతీయ మహిళలు
అభివృద్ధి సాధించడానికి, శ్రేయస్సు పొందడానికి సీతామార్గాన్ని
అనుసరించడంతప్ప మరో మార్గం లేదు.
భారతీయ మహిళకు శుచిత్వమే ఆదర్శం
బుద్ధిబలమే పరమార్థం కాదు. నీతి, ఆత్మదృష్టి అవసరం. భారతీయ మహిళలలో
పాండిత్యం, విద్య తక్కువ కావచ్చును కానీ వారిలో పవిత్రత ఎక్కువ. భార్య తప్ప
ఇతర మహిళలను తల్లిగా భావిస్తాడు భారతీయుడు. భారతీయ మహిళల్లో ప్రపంచంలో
మరెక్కడా కనిపించని శీలం, త్యాగం, దయ, తృప్తి, భక్తి కనిపిస్తాయి. సిగ్గు,
మితంగా మాట్లాడటం వంటి లక్షణాలు మహిళలకు శోభనిస్తాయి. ఇవి భారతదేశపు
మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పాశ్చాత్య దేశాల్లో స్త్రీ అంటే భార్య గుర్తుకు వస్తుంది. అక్కడ
మాతృత్వపు స్థానం కంటే భార్య ¬దా ఎక్కువ. కానీ మన దేశంలో అలా కాదు. ఇక్కడ
మాతృత్వానికే విలువ. ‘భారతదేశంలో గృహిణి స్థానం ఏది’ అని మీరు
(పాశ్చాత్యులు) ప్రశ్నిస్తారు. ‘అమెరికా కుటుంబంలో తల్లిస్థానం ఏది?’ అని
భారతీయులు ప్రశ్నిస్తారు. తల్లి పరమ పూజ్యురాలు. స్త్రీ అనే మాట కేవలం శరీర
సంబంధ మైనది కాదు. స్త్రీ అంటే తల్లి. దురాశలను, దుష్కామాలను అణచ గలిగే
శక్తి ‘అమ్మ’ అనే మాటకంటే ఇక ఏ పదానికి ఉంది? అందుకని తల్లే భారతీయుల
ఆదర్శం.
వ్యక్తిదృష్టి, సంఘదృష్టి
పాశ్చాత్యుల్లో వ్యక్తిదృష్టి ఎక్కువ. భారతీయుల్లో సంఘదృష్టి ఎక్కువ.
నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకో వచ్చని, అందుకు ఇతర అడ్డంకులు ఏవీ లేవని
పాశ్చాత్యులు భావిస్తారు. వ్యక్తి నచ్చినా వారి కుటుంబం, వారసత్వాన్ని కూడా
చూడాలని భారతీ యులు భావిస్తారు. తాగుబోతులు, అనారోగ్య వంతులు, పిచ్చివారి
సంతతిని పెళ్ళి చేసుకోరాదని ధర్మశాస్త్రం చెపుతోంది.కానీ మేం పరాజితుల
మవడంవల్ల అనేక దేశాల వారు అనేక చట్టాల్ని, నిబంధనల్ని మా తలపై రుద్దారు.
అనేక దురాలోచనలు, దురభిప్రాయాలను మాకు అంటగట్టారు.
(స్వామి వివేకానంద సమగ్ర గంథావళినుండి…)
విశ్వ సంవాద కేంద్రం, తెలంగాణ సౌజన్యంతో...
విశ్వమత మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం 11-సెప్టెంబర్-1893
మహిళల గురించి భారతీయుల, పాశ్చాత్యుల ఆలోచనలో చాలా తేడా ఉంది. వారివారి జీవన విధానాన్ని బట్టి ఈ తేడాలు వచ్చాయి. భారత దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం, ఆమె ఎదుర్కొం టున్న సమస్యల గురించి స్వామి వివేకానంద అనేకసార్లు ప్రస్తావించారు. వారి ఉపన్యాసాల్లో చెప్పిన అనేక ముఖ్య విషయాలను చూద్దాం.
ReplyDelete