పర్యావరణం నిజంగా ప్రమాదం లో పడిందా?
పర్యావరణం నిజంగా ప్రమాదం లో పడిందా?
పర్యావరణ విధ్వంసకులు ఏరి? ఎక్కడున్నారు?
ఈ విశ్వం లో వైజ్ఞానికంగా కనుగొన్న గ్రహాలు 2,200 అయితే, భౌతిక ప్రక్రియ జరిగి జీవి పుట్టుకకు సానుకూలంగా ఈ ఒక్క భూమిలో మాత్రమే ప్రాణ వాయువు (oxygen), నీరు,గ్రహం చుట్టూ రక్షణ కవచం వలె ఒజొన్ పొర మరియు అయస్కాంత శక్తి మండలం (magnetic field ) వంటి అనుకూల వాతావరణం వుంది.
స్వచ్చమైన నీరు,కాలుష్యరహిత గాలిమరియు జీవరాసులు తట్టుకోగల ఉష్ణోగ్రత--- ఈ మూడూ పరస్పరం ఆధార పడి వున్నాయి.
అయితే అవగాహన లేక కొందరు, మితి మీరిన అహంకారం కలిగి కొందరు, తమ స్వార్థ ప్రయోజనాలకు కొందరు ఇలా ప్రకృతికి హాని తల పెడుతూన్నారు.
తీవ్రతరమైన పారిశ్రామికీకరణ వల్ల వదలుతున్న బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) మరియు మీథేన్ వాయువుల వల్ల భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత పెరగటమే (గ్లోబల్ వార్మింగ్) ప్రపంచం లో ఒక పెద్ద సమస్యగా తయారయింది.
ఉష్ణోగ్రత పెరిగి ధ్రువాల వద్ద మంచు కరిగి సముద్రమట్టం పెరగటం, సమీప తీర ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు 130 కోట్ల ప్రజల జీవన భద్రత కు ప్రమాదం ఏర్పడింది.
ప్రాణ వాయువు ఇచ్చే సమీప అడవులు అదృశ్యం కానున్నాయి.అంటే వృక్షాలు, జల చరాలు, వన్యప్రాణులు, కనపడకుండా పోతాయి. లవణపు నీటితో భూమి కోతకు గురై పంటలు ధ్వంసం అవుతాయి. స్వచ్చమైన నీరు లభించదు. Oxygen ఇచ్చే వృక్షాలు లేక జంతువులు,పక్షులు, మనుష్యులు ఇలా చరాచర జీవకొటి మనుగడకు ప్రమాదం వాటిల్లనున్నది.
స్వార్థ రాజకీయ నాయకులు,అవినీతి అధికారులు,అత్యాశ,దురాశ లు కలిగిన పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు, ప్రభుత్వ నీతి మాలిన విధానాలు,అధిక లాభాలే ధ్యేయంగా వస్తువులను డంపింగ్ చెస్తున్న విదేశీ కంపనీలు, వర్థమాన దేశాల వనరులను దోచుకుంటున్న అగ్ర దేశాలు, అవగాహన లేని ప్రజా సముహాపు చేష్టల వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రకృతి విలయం సంభవించనున్నది.
ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ఎలా సాధ్యం?
ఈ పనిని తమ భుజస్కంధాలపై మోసి చరాచర జీవకోటిని కాపాడేదెవరు?
- Appala Prasad garu
పర్యావరణం నిజంగా ప్రమాదం లో పడిందా?
ReplyDelete