Breaking News

గ్లోబల్ వార్మింగ్ తో దీవులు,అడవులు కనుమరుగు కానున్నాయి-Save Environment

ఏళ్ల తరబడి సముద్రం గడ్డ కట్టి ఉండే ప్రాంతాన్ని cryosphere అంటారు. ఆ ప్రాంతంలో ఎవరూ నివసించరు. అక్కడ చోటు చేసుకుంటున్న మార్పులు,ఉపద్రవాలు అందరికీ తెలియజెయటం కష్టం అవుతుంది ఐక్యరాజ్య సమితి కి చెందిన ICIC సంస్థ ఒక నివేదిక లో 5 రకాల ప్రమాద సంకేతాలు పేర్కొన్నది.

1. పారిశ్రామికీకరణ వల్ల కాలుష్యం పెరిగి,ఉష్ణోగ్రత కూడా ఎక్కువై వేగంగా మంచు కరుగు తున్నది. ఫలితంగా సముద్ర మట్టం 1మీ పెరుగనున్నది.ఇది ఆర్కిటిక్,అంటార్కిటికా,ఇతర పర్వత ప్రాంతంలో మంచు కరుగుతున్నది.
2.గ్రీన్ లాండ్ ,అంటార్కిటికా లలో మంచు పూర్తిగా అదృశ్యం కానుంది. ప్రమాద స్థాయికి మించి ఉష్ణోగ్రత పెరుగు తుందనీ అవగాహన లేకపోవటం
3.భూగోళంలో ని ఉత్తరార్థం లో నీరు గడ్డ కట్టి వుంది ఆర్గానిక్ కార్బన్ కూడా ఘనీభవ స్థితిలో వుంది.మంచు కరిగితె కార్బన్ డై ఆక్సైడ్,మీథేన్ వాయువు విస్పోటనం చెంది 50 గిగా టన్నుల కార్బన్ పరిసరాల్లోకి విస్తరిస్తుంది.
4.గ్లోబల్ వార్మింగ్ వల్ల కరిగిన మంచు నీరు వేడెక్కి, సముద్రం అడుగున జలాలు కూడా వేడెక్కి లోపల ఉన్న మంచు పర్వతాలు కరుగుతాయి.
5. ఐరోపాలోని ఆల్ఫ్స్ పర్వతాలు, అమెరికా లోని రాకీ పర్వతాలు, భారత్ లో హిమాలయ పర్వతాల లో పెద్ద మొత్తం లో మంచు కరిగే ప్రమాదం ఉంది.

కాబట్టి రాబోయే రోజుల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిది.లెనట్లయితే ప్రజల సాంస్కృతిక,ఆర్థిక మనుగడకే పెద్దదెబ్బ.
మానవ జాతి చరిత్ర లో గత 3మిలియన్ సంవత్సరా లలొ జరగని విధంగా ధ్రువాల వద్ద మంచు కరుగుతున్నది.
సుందర్బన్ అడవులు
భారత్ బంగ్లాదేశ్ లలో 1లక్షా 40 వేల హెక్టార్ల మేర విస్తరించిఉన్న అడవులను 'సుందర్బన్ 'అడవులు అని పిలుస్తారు.గంగా నది,ఇరావతి నది పాయలుగా ఈ అడవుల గుండా ప్రవహిస్తుంది.డాల్ఫిన్ చేపలు,మొసళ్లు,కొండచిలువలు,సుమారు 500 బెంగాల్ టైగర్లు ఈ ప్రాంతం లో వున్నాయి.సముద్ర మట్టం పెరిగేసరికి అడవులు క్రమేపీ తగ్గుతున్నాయి. తీర ప్రాంతాలు కోత కు గురవుతున్నాయి. ఈ అడవుల రక్షణ యుద్ద ప్రాతిపదిక న జరగాలి.
కిరిబాటి దేశం అదృశ్యం కానున్నదా ?
కామన్వెల్త్ దేశాల్లో ఒకటైన 'కిరిబాటి' అను స్వతంత్ర దేశం పసిఫిక్ సముద్రం లో వుంది. 33 దీవుల సమూహం ఇది. సముద్ర మట్టం పెరగటం తో ఈ దేశం లోని దీవులు ఒక్కొక్కటి పూర్తిగా సముద్రం లో మునిగి పోయే అవకాశం ఉంది.కిరిబాటి ప్రాంతం చెత్త ను పారవెసే డంపింగ్ యార్డుగా మారింది. ఆహార ఆర్థిక వనరుల కొరత ఏర్పడుతుంది.వ్యర్థ పదార్థాలతో పరిసరాల్లో కాలుష్యం విస్తరిస్తున్నది.అభివృద్ది చెందిన దేశాల భొగానికీ ఇటువంటి దేశాలు బలి అవుతున్నాయి.
మాల్దీవుల ప్రజల మనుగడ ప్రమాదం లో పడింది.
అలాగే వెయ్యి కంటే ఎక్కువ దీవులున్న రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవులు కను మరుగయ్యే ప్రమాదం ఏర్పడింది.వాళ్ల పునరావాసం ఒక సమస్య అవుతుంది. జీవనాధారంగా,ప్రాణ ప్రదాన సముద్రమే మాల్దీవుప్రజలకు శత్రువు అయ్యింది. ఎంత విషాదం!
సముద్ర జలాల విస్తరణ , ఆ జలాలు వేడెక్కటం, మంచు కరగటం వల్ల భావి తరాల ప్రజలు ముఖ్యంగా తీర ప్రాంతంలో నివసించే 130 కోట్ల ప్రజలు దిక్కు తోచక వలసలు తప్ప జీవించడానికి మరో మార్గం లేని పరిస్తితి ఏర్పడింది.
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:


  1. మానవ జాతి చరిత్ర లో గత 3మిలియన్ సంవత్సరా లలొ జరగని విధంగా ధ్రువాల వద్ద మంచు కరుగుతున్నది.

    ReplyDelete