Breaking News

పర్యావరణం-Environment


పర్యావరణం గురించి అగ్ర దేశాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు మనకు ఉపదేశాలు ఇస్తుంటాయి. ఫాదర్స్ డే,మదర్స్ డే,ఎర్త్ డే అని ప్రకటించే ఐక్యరాజ్య సమితికి కుటుంబాల పట్ల, భూమి పట్ల అమెరికా,చైనా దేశాలకున్న శ్రద్ద ఎంత వుందో తెలియదా?
పాశ్చాత్య మతాలు ప్రకృతిలో వున్న సంపదను దోచుకొవడానికే మనుష్యులను సృశ్టించాడని భావిస్తాయి. ఒక మతం స్త్రీని, రాక్షసి గయ్యాలిగా ప్రకటించి, కఠిన శిక్షలు విధించింది.మరొక మతం స్త్రీని వ్యవసాయ పొలంగా భావించి,ఎంత పడితే అంతా దున్నుకొవాలని చెప్పింది.
ఒకసారి ఇంగ్లాండ్ పార్లమెంట్ లోని దిగువ సభలో 'జీవులపై క్రూరత్వాన్ని ఆపెయాలని' బిల్లు తెచ్చి ఆమోదించారు.కాని ఎగువ సభలో మాత్రం అది వీగిపోయింది.కారణం.. కెంటర్బరి ఆర్ఛ్ బిశప్ ఒప్పుకోలేదు. మనుష్యులు తప్ప వేటినైనా చంపటంలో పాపం రాదని ప్రకటించాడు.
పాశ్చాత్యులు చెప్పేది అభివృద్ది కానే కాదు.పారిశ్రామిక విప్లవం పేరుతో వలస దేశాలను దోచాయి. 17 లక్షల కోట్ల పౌండ్లు ఇంగ్లాండు మన దేశం నుంచి దోచుకునిపోయింది. స్వాతంత్ర్యం తరువాత విదేశీ కంపనీలు, చైనా కంపనీలు దోచుకుని పోతున్నాయి.వర్ధమాన దేశాల నుండి ముడి సరుకు వారి దేశాలకు తరలించాయి.తయారు చెసుకుని మళ్లీ మన దేశంలోనే అమ్మి డబ్బులు గడించాయి.
అడవులను నరికి, పట్టనీకరణ జరిపి, నదులు కలుషితం చెసి, ఆధునిక వాహనాల వాడకాన్ని పెంచి, గ్యాస్ పెట్రోల్,డీజల్,బొగ్గు మొదలైన శిలాజాలను మండిస్తూ భూ ఉపరితలం పై కర్బనం,మీథేన్ వాయువులను వదలి వేడి ని తెచ్చి, గ్లోబల్ వార్మింగ్ ని పెంచి పోషిస్తున్నాయి. ఫలితంగా వేడి పెరిగి, ధ్రువాల్లో మంచు కరిగి,సముద్ర మట్టం పెరిగి,తీర ప్రాంతంలో గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.
పరిశ్రమలు వదిలి పెట్టే వాయువు లేదా వ్యర్థాల వల్ల వాయు, జల కాలుష్యం జరుగుతున్నది.
ఇదేనా పాశ్చాత్య దేశాలు మనకు ఉపదేశించి, ఆచరించేవి? ఈ విదేశీ ఆర్థిక మార్గాలు అవలంబించిన వర్థమాన దేశాల అభివృద్ది ఎలా ఉంటుందో
ఊహించండి . 4 శాతం జనాభా కూడా లేని అమెరికా ప్రపంచం లోని 40 శాతం వనరులు దోచుకుంటున్నది.చైనా 50 శాతం కార్బన్ డై ఆక్సైడ్ వదలి పెడ్తూ ప్రపంచ ప్రజలను భయాందోళనలకు గురి చెస్తున్నది.
మరి మన దారెటు?
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. పర్యావరణం గురించి అగ్ర దేశాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు మనకు ఉపదేశాలు ఇస్తుంటాయి

    ReplyDelete