Breaking News

వెర్రి తలలు వేస్తున్న భోగం

వెర్రి తలలు వేస్తున్న భోగం - దేహ సౌందర్యం కోసం మూగ జీవుల హత్యాకాండ - ప్రకృతి లో అసమతుల్యం.

'బిజ్జూ ' అనే ఒక ప్రాణిని కర్రలతో బాగా కొడితే,అది బాధతో విల విల్లాడుతుంది. శరీరం పైన అయిన గాయాలైన చోట చర్మాన్ని పూడ్చు కోవడానికి ఒక మృదువైన పదార్థాన్ని స్రవిస్తుంది.చాకుతో ఆ పదార్థాన్ని గీకి, దానిని సెంట్లు (అత్తరు)తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
స్లెండిచ్ లొరిస్ అను ప్రాణుల గుండెను,కనుగుడ్డు ను తీసి నూరి,ఫేస్ పౌడర్ లో కలుపుతారు.

లిపిస్టిక్,టాల్కం పౌడర్,హెయిర్ డే లను కోతుల పై ప్రయోగించి చంపుతారు.చావని కోతులను కోసి ఎందుకు చావలేదో చూస్తారు.
కొన్ని సౌందర్య సాధనాలను కుందేళ్ల కళ్లలో వేసి పరీక్షిస్తారు.
కృత్రిమ అలంకరణ కోసం ఇంత దారుణమా?
ఇళ్ల లో అందంగా అలంకరణ కోసం ఏనుగులను ఎంత ఘోరంగా చంపుతారో. అందుకే వాటి సంఖ్య15లక్షల నుండి 6లక్షల కు తగ్గింది. ఎనుగులను చంపే ముఠా ను నడిపేది చైనాయే. పులి గోర్ల కోసం పులులను చంపుతారు.
మహారాష్ట్ర లో ఠానే జిల్లాలొ పొలాల్లొ పెద్ద పెద్ద కప్పలు వుంటాయి.
అమెరికావారికి కప్ప కాళ్లు యిష్టమని, కప్పలను చంపటం జరుగుతుంది.కప్పలు లేని కారణాన ధాన్యం దిగుబడి తగ్గి పోయింది.
భూముల్లో రసాయన మందులు ఉపయోగించి వానపాములను చంపుతున్నారు. ఈ విషపు వాసన భరించలేక 30 అడుగుల లోతులో దాక్కుంటున్నాయి.

1958 లో చైనా లో పెద్ద ఎత్తున పిచ్చుకలను చంపాలని ప్రభుత్వం పిలుపిస్తే లక్షల పిచ్చుకలను చంపి వేశారు.ఎందుకంటే ఆ పిచ్చుకలు ధాన్యం గింజలు తింటున్నాయట.ఇప్పుడు పిచ్చుకలు లేవు. పంటలను ఆశించి వచ్చే క్రిమి కీటకాలను తినే పిచ్చుకలు లేక పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. క్రిములు 3రెట్లు పెరిగాయి.
క్రిష్ణ సార మృగం మన దేశపు వన్యప్రాణి.బ్రిటిష్ కాలంలో వేల సంఖ్యలో ఆ మృగాలు హతమయ్యాయి.
చైనా నైతే కోతులు, పాములు,కప్పలు, కుక్కలు,తాబేళ్ళు ఇలా 'తినడానికి కాదేది అనర్హం' అన్నీ తిని తిని లేని రోగాలు అంటించి కరొనా పేరుతో లక్షల మంది ని బలి తీసుకున్నారు.
ఇంగ్లండ్ లో ఆవు మాంసం యిస్టంగా తింటారు. ఆవు శరీరం లో మాంసం ఎక్కువగా పెరగాలని,గడ్డి తినే అలవాటు ఉన్న ఆవులకు మాంసం తినిపించారు. ఆ మాంసం తిన్న వారికి మెదడు వ్యాధులొచ్చాయి. దాంతో వేల సంఖ్యలో ఆవులకు పిచ్చి ఎక్కిందంటు, వేల ఆవులను చంపారు.
లక్షల సంఖ్యలో భారత్ లో పశు సంపదను వధశాలలకు పంపి,వాటి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
ప్రపంచం లో 130 జాతులకు చెందిన జంతువులు నశించిపొయాయి.
భూమిపై జంతు జాలం లేకపోతే వైవిధ్యం నశించి పోతుంది.
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. దేహ సౌందర్యం కోసం మూగ జీవుల హత్యాకాండ

    ReplyDelete