భూమాత - గృహిణీ మాత - గోమాత
దైవీ త్రికోణం' ప్రకృతి కి ఆధారం. విశాల విశ్వానికి ఆలంబన.
భూమాత - గృహిణీ మాత - గోమాత
పది మంది పుత్రుల కంటె ఒక చెట్టు ఇంటికి ఎక్కువ మేలు చేస్తుంది.
'దైవీ త్రికోణం' తో పకృతికే పచ్చదనం. మనుష్యులు, వృక్షాలు,జంతువులు, భూమి ఇవి అన్నీ పరస్పరపూరకం. పైకి వేరు వేరు గా కనిపించినా, ఒకరి అవసరాన్ని మరొకటి తీరుస్తోంది.
జంతువులు,మనుష్యులు నిస్వాశ ద్వారా వదిలే కార్బన్ డై ఆక్సైడ్ ని చెట్లు ఆహారంగా గ్రహిస్తాయి.కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా ఆకులు,కాయలు, పండ్లు ఉత్పత్తి చేసి, అలాగే oxygen ని జంతువులకు , మనుష్యులకు అందిస్తాయి. మనుష్యులు,జంతువులు వదిలే మల మూత్రాలు చెట్ల పెరుగుదలకు ఎరువుగా ఉపయోగపడతాయి. అలాగే తొక్కలు,తౌడు, గడ్డి ఇతర వ్యర్థ పదార్థాలు జంతువులు తిని పాలు ఇస్తాయి. ఈ పరస్పర సహకారమే పర్యావరణ పరిరక్షణకు శ్రీ రామ రక్ష.
ఇంకో విధంగా చెప్పాలంటే ...
భూమాత మనుష్యుల, జంతువుల విసర్జన పదార్థాలు ఎరువుగా గ్రహించి, పంటలు ఇస్తే, అవి తిన్న గృహిణి మాత గడ్డి, తౌడుని గోమాత కిస్తే అవి పాలు ఇస్తాయి. దీన్నే 'దైవీ త్రికోణం' అంటారు. భారతీయ ఋషి పరంపర ప్రకృతి సంతులన కోసం మనిషి తన కర్తవ్యాన్ని నిర్వహించమని సూచించారు. 'దైవీ త్రికోణం' ను కాపాడాలి.
పసిఫిక్ యూ అనే చెట్టు నుండి టాక్సాల్ అనే రసాయనం క్యాన్సర్ పుండ్లను తగ్గిస్తుంది. సముద్రం లో వుండే సూక్ష్మ జీవులు, నీళ్లలో చమురు ఒలికిపొతే, త్రాగి పరిశుభ్రం చెస్తాయి. 'నాస్తిమూలమనౌషధం' అన్నట్లు ఔషధం కాని మూలికలే లేవు.
అయితే యుకలిప్టస్ చెట్లు పనికిరానివి పెంచవద్దు. వీటి ఆకులు పశువులు తినవు. పక్షులు గూళ్లు పెట్టవు. అలాగే భూమి లోని నీటినంతా ఎక్కువ మొత్తంలో లాగేస్తుంది.
అందువల్ల మన దేశం లో 'పంచవటి' కల్పన ఉంది. Oxgen ఎక్కువగా ఇచ్చే రావి,మర్రి, తులసి,వేప చెట్లు పెంచాలి. ఐదవది మామిడి, జువ్వి,నేరేడు,అత్తి,తుమ్మ ---వీటిలో ఏదో ఒకటి ఎంపిక చేసి పెంచవచ్చు..
రావి చెట్టు ద్వారా ఒజొన్ వాయువు విడుదల అవుతుంది. శ్రీ కృష్ణ పరమాత్మ రావి చెట్లో తానున్నాని స్వయంగా చెప్పాడు. జలం స్వచ్చమైనదిగా వుండాలంటే నదీ తీరంలో చెట్లు పెంచాలి.
1. ఒక ఎకరంలోని చెట్లు 18 మంది వ్యక్తులకు సంవత్సరమంతా oxgen ఇస్తుంది.
2. ఒక చెట్టు 118 కిలోల oxgen ఇస్తుంది.
3. ఎక్కువ చెట్లు రష్యాలో,ఆ తరువాత వరుసలో కెనడా బ్రెజిల్,అమెరికా లో ఉన్నాయి
4. AC 20 గంటలవరకు నడిపిస్తే ఇచ్చే చల్లదనం ఒక చెట్టు క్రింద వుంటే అంతే చల్లదనం ఇస్తుంది
5. ఒక చెట్టు భూమి నుండి ప్రతి సంవత్సరం 2000లీటర్లు మాత్రమే నీటిని గ్రహిస్తుంది.
6. విశ్వంలో 20శాతం oxgen అమెజాన్ అడవుల నుండి వస్తుంది.
7.చెట్లకు ఆయుష్షు తీరదు. క్యాన్సర్ వస్తుంది. చావదు కాని oxgen తక్కువ ఇస్తుంది.
8. పది మంది పుత్రుల కంటె ఒక చెట్టు ఇంటికి మేలు చేస్తుంది.
- Appala Prasad garu
No comments