Breaking News

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కి డబ్ల్యూహెచ్‌వో కీలక పదవి

శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైద్యరంగంలో నిపుణులైన 34 మంది ఆ బోర్డులో సభ్యులుగా ఉంటారు. జపాన్‌కు చెందిన డాక్టర్ హిరొకి నకతాని నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనావైరస్‌ను భారత్‌లో కట్టడి చేయడంలో హర్షవర్ధన్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

‘మహమ్మారి కారణంగా ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్న సమయంలో నేను ఈ పదవిని స్వీకరిస్తున్నానని తెలుసు. రానున్న రెండు దశాబ్దాల్లో కూడా ఆరోగ్యపరమైన మరిన్ని సవాళ్ల ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. వాటి మీద భాగస్వామ్యంతో పనిచేయాలి’ అని బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మే నుంచి మూడు సంవత్సరాల కాలానికి భారత్‌కు చెందిన నామినీని ఎన్నుకోవాలని గతేడాది ఆరోగ్య సంస్థకు చెందిన సౌత్‌-ఈస్ట్ ఏషియా గ్రూప్‌ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ ఎన్నికకు 194 దేశాలతో కూడిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అంగీకారం తెలిపింది.
Source - VSK Andhra Pradesh

1 comment:

  1. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కి డబ్ల్యూహెచ్‌వో కీలక పదవి

    ReplyDelete