Breaking News

అన్నమయ్య కీర్తనలు-అదివో అల్లదివో శ్రీహరివాసము-Adivo Alladivo Sriharivasamu

అదివో అల్లదివో (రాగం: మధ్యమావతి ) (తాళం : ఆది) 

అదివో అల్లదివో హరివాసము
పదివేలు శేషుల పడగలమయము॥

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥

చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥

కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము॥

5 comments:

  1. అదివో అల్లదివో శ్రీహరివాసము
    పదివేల శేషుల పడగలమయము

    ReplyDelete
  2. పదివే...లు శేషుల
    అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. తప్పు సరిచేయటం జరిగినది. ధన్యవాదములు.

      Delete
  3. అన్నమయ్య పల్లవిలో అదివో అల్లదివో హరివాసము అనే ఉంది. ప్రచారంలో శ్రీహరి వాసము అంటున్నారు పొరపాటు - అలా ఐతే యతిభంగం.

    ReplyDelete
    Replies
    1. తప్పు సరిచేయటం జరిగినది. ధన్యవాదములు.

      Delete