Breaking News

అన్నమయ్య కీర్తనలు-కాదనకు నామాట కడపరాయ నీకు-Annamayya Keerthanalu-Kadanaku Naa mata



కాదనకు నామాట కడపరాయ నీకు
గాదె పోసెవలపు కడపరాయ                     || ||కాదనకు నామాట||

కప్పురమియ్యగ రాద కడపరాయ నీకు
కప్పితినా పయ్యెదెల్ల కడపరాయ
కప్పుమీదె కుచములు కడపరాయ వో
కప్పు మొయిలు మేనిఛాయ కడపరాయ   || ||కాదనకు నామాట||

కందువగు రారాజు కడపరాయ ముందె
గంద మిచ్చినాడవు కడపరాయ
కందము నీ మాలెల్ల కడపరాయ వో
కందర్ప గరుడమొక్కే కడపరాయ             || ||కాదనకు నామాట||

కలిసితి విటు నన్ను కడపరాయ నా
కలనేడు నిజమాయ కడపరాయ
కలదా ననేను కడపరాయ వో
కలికి శ్రీ వేంకటాద్రి కడపరాయ                  || ||కాదనకు నామాట||

1 comment:

  1. కాదనకు నామాట కడపరాయ నీకు
    గాదె పోసెవలపు కడపరాయ

    ReplyDelete