Breaking News

స్వదేశీ ఉద్యమ గీతం-Swadeshi Movement Song


స్వరాజ్యమైతే సాధించాము ఫలితం ఏముంది ఇంకా బానిసత్వముంది- వీడని భావదాస్యముంది
స్వదేశమ్మున స్వావలంబనను సాధించగరండి
స్వతంత్రం సాధించగ రండి!!

1. ఈస్టిండియా అను కంపెనీ ఇచ్చట వ్యాపారము చేసే
మనలను బానిసలుగ చేసే...
నేత కార్మికుల చేతులు నరికి పరిశ్రమలు మూసే
మన సంపదలను దోచే ...
ఆనాటి దుస్థితి మళ్లీనాడు దాపురించెనయ్యో
మనలను మోసగించిరయ్యో !! స్వరాజ్యమైతే!!
2. సూది మొదలు రైలింజనులన్నీ విదేశీ వస్తువులే
కొంటె దేశం దివాలా తీయునులే.. లేచిన మొదలు అవసరమైనవి విదేశీ వస్తువులే అసలే స్వదేశీ చూడములే ..
ఉపాధి పోయిన కార్మికులంతా బాధ చెందిరయ్యో
తీరని వెతలు పొందిరయ్యో !! స్వరాజ్యమైతే!!
3. కాళ్లు స్వదేశీ, చెప్పులు విదేశీ, ముఖమ్ము స్వదేశీరా నీ సబ్బే విదేశీరా
గడ్డం స్వదేశీ, బ్లేడ్ విదేశీ, దేహము స్వదేశీరా
నీ మెదడే విదేశీరా
ఇన్నాళ్లకైనా స్వదేశీ తత్వం వంట పట్టలేదా -
విదేశీ మోజు తీరలేదా !! స్వరాజ్యమైతే!!
4. తిలక్, గాంధీ, సావర్కర్ లంతా ఉద్యమాలు తీసి స్వదేశీ భక్తిని చాటిరయో
జనతను జాగృత పరచిరయో... ఇంటనున్న విదేశీ వస్తువులు బయట పారవేసి- ప్రజలే దహనం చేసిరయో - భలేభలే పండుగ చేసిరయో
ఆనాటి ప్రజల స్వాభిమానమును తెలిసి నడుచుకోండి
స్వదేశీ భావన పెంచండి - స్వతంత్రం కాపాడగ రండి
!! స్వరాజ్యమైతే!!


1 comment:

  1. స్వరాజ్యమైతే సాధించాము ఫలితం ఏముంది ఇంకా బానిసత్వముంది- వీడని భావదాస్యముంది

    ReplyDelete