Breaking News

చైనా వస్తువులు 'కొనవద్దని' నెగెటివ్ గా ఎందుకు చెప్పాలి?


ప్రపంచ దేశాల్లో మన దేశ వస్తువులు కూడా అమ్ముతున్నారు కదా? Indian goods ని అక్కడి వాళ్లూ బహిష్కరిస్తే...?
ఇచ్చి పుచ్చుకొవడం, సమాన స్థాయిలో వ్యాపారాలు కొనసాగించటం ఎవరికీ అంత పెద్ద నష్టం లేదు.కాని చైనా అలా కాదు.భారత్ లోని ఒక్కొక్క వస్తువుల రంగాన్ని వ్యూహాత్మకంగా భారతీయ పారిశ్రామిక వేత్తల నుండి లాక్కుని, ఆక్రమిస్తున్నది.
1. ఉదాహరణకి వస్త్రాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. భారతీయ రైతులు పండించే ప్రత్తి ధర క్వింటాలు కి 4000 రూపాయలు వుంటే 2013 లో చైనా 7000 రూపాయలు రైతులకు చెల్లించి మొత్తం పంటను కొనివేసింది. మన దేశపు వస్త్ర పరిశ్రమలకు ప్రత్తి దొరక కుండా చేసింది. దాంతో మన వస్త్ర పరిశ్రమలు మూత పడ్డాయి. లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు.ఇలా ఏ దేశం లో మార్కెట్లలో చైనా ప్రవేశించినా, అక్కడ చైనా తమ వస్తువులను తక్కువ ధరకు అమ్మి ఆయా దేశాల వస్తువులు మార్కెట్లో లేకుండా చేయటం చైనా వ్యూహం లో భాగం... ఇంతే నా?ఇంకేమైనా ఉన్నాయా? చైనా గతం,వర్తమానం అంతా భారత్ వ్యతిరేక చర్యలే..

2. సైకిళ్ళ పరిశ్రమ వల్ల మన దేశం లో లక్షలాది కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి. సైకిళ్ళలోని అన్ని భాగాలు చైనా నుండి రావటంతో తక్కువ ధరకు లభించటం వల్ల పంజాబ్ లో వందల ఫ్యాక్టరీలు మూత పడ్డాయి.ఒక్క ఫిరొజాబాద్ లో 400 మూత పడి 40 మిగిలాయి.
3. భారత్ లోని ట్రక్కులు,బస్సుల కు కావలసిన 1,30,000 టైర్లు మన మార్కెట్లలో డంపింగ్ చెసి, ఎటువంటి వారంటీ,బిల్లు లేకుండా తక్కువ ధరకు అమ్మటం తో మన టైర్ల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.
4. సొలార్ ప్యానల్ ఒక కిలోవాట్ కి 0.51డాలర్ చొప్పున మనం తయారు చేసి అమ్ముతుంటే, చైనా 0.40 డాలర్ చొప్పున అమ్మి మన ఫ్యాక్టరీలను దెబ్బ తీసింది.అదే జపాన్ లో నైతే చైనా సొలార్ ప్యానల్ ల పై దిగుమతి సుంకం భారీగా విధించి తమ ఫ్యాక్టరీలను కాపాడుకుంటున్నది.
5. ఎలక్ట్రానిక్ రంగం పూర్తిగా చైనా చేతుల్లోకి పోయింది. విప్రో,జీనత్ కంపనీలు ఉత్పత్తి చేయలేక చేతులెత్తేశాయి. ఇంజినీరింగ్ కళాశాలలలో ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ తీసుకునే విద్యార్థులే లేరు. ఇలాగే 10సంవత్సరాలు కొనసాగితే అప్పుడు ఎంటెక్ బీటెక్ పిహెడీ చేసిన టెక్నొక్రాట్లు దొరకక పోతే మళ్లీ ఎలెక్ట్రానిక్ రంగాన్ని పునరుద్దరించేదెలా?
చైనా విద్రోహ చరిత్ర ఇంకా వుంది.
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. చైనా వస్తువులు 'కొనవద్దని' నెగెటివ్ గా ఎందుకు చెప్పాలి?

    ReplyDelete