Breaking News

అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి డా. మార్క్ ఫాబర్


అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి డా. మార్క్ ఫాబర్ తన మాస పత్రిక లో అమెరికన్లకు సలహా ఇస్తూ ఇలా పేర్కొన్నాడట.
ఫెడరల్ ప్రభుత్వం మనలో ఒక్కొక్కరికి 600 డాలర్లు తిరిగి ఇచ్చేస్తుందట.
1. వాల్ మార్ట్ లో ఖర్చు పెడితే ఆ డబ్బు చైనా కు పోతుంది
2. గ్యాసోలీన్ కి ఖర్చు పెడితే అరబ్బుదేశాలకు పోతుంది
3. పండ్లు,కూరగాయలకు ఖర్చు పెడితే మెక్సికో కు పోతుంది
4. మంచి కారు కొంటే అ డబ్బు జపాన్,జర్మనీ కి పోతుంది
5. సాఫ్టువేరు కొంటే భారత్ కి పోతుంది
6. పనికిరాని చెత్త కొంటే తైవాన్,కొరియా కు పోతుంది.
7. ఇవేవీ కొనకపోతేనే అమెరికా కు సహకరించిన వారు అవుతారు.
ఇక ఒకే ఒక మార్గం మిగిలింది. మన డబ్బును ఇంట్లో దాచిపెట్టి, ఆ డబ్బుతో తుపాకులు,బీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా ఉత్పత్తి చేసేవి ఈ రెండే రెండు..

విదేశీ వస్తువులు బహిష్కరించాలని పిలుపిస్తే, ఇక భారతీయ వస్తువులు ఏమి మిగిలివున్నాయి కనుక..అంటూ కొందరు వెక్కిరిస్తున్నారు. ఇప్పుడైనా మేల్కొనకపొతే అమెరికాలో కనీసం ఆ రెండు మిగిలాయి. మనకు ఆ రెండు కూడా మిగలవు.
సూక్ష్మ,చిన్న , మధ్య తరహా భారతీయ పరిశ్రమలు, మన పరిసరాల్లో వుండే స్థానిక పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులు కొంటుంటే, నెమ్మదిగా సరసమైన ధరలకు,నాణ్యతతో లభిస్తాయి. అవి నడిపే లక్షలాది పారిశ్రామిక వేత్తలు, కోట్లాది కార్మికులు,వారి కుటుంబాలు, పిల్లలు జీవనం గడుపుతారు. దాన ధర్మాలు చేసి పుణ్యం దక్కించుకుందామనుకుంటాము. ఉచితంగా డబ్బు ఇచ్చేదేమీ లేదు కదా? మీకు కావలసిన స్వదేశీ వస్తువులు కొనండి చాలు..భారత ఆర్థిక వ్యవస్థలోనే ఒక గొప్ప మార్పు వస్తుంది.
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి డా. మార్క్ ఫాబర్ తన మాస పత్రిక లో అమెరికన్లకు సలహా ఇస్తూ ఇలా పేర్కొన్నాడట

    ReplyDelete