సంక్రాంతి పండుగ-Sankranthi Festival
సంక్రాంతి పండుగ రోజున ప్రకృతి లో వచ్చే మార్పుల వలెనే మనుషుల మనస్సు లలో కూడా మార్పు వచ్చినప్పుడు మాత్రమే నిజమైన సంక్రాంతి పండుగ వచ్చినట్లు అని పెద్దలు చెపుతారు.అటువంటి మార్పు తేవడానికి ఎందరో మంచి మనుషులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో కొన్ని ఇవి.
9. భూపాలపల్లి జిల్లా లోని నల్లకుంట గ్రామంలో అన్ని కులాల వారు కలిసి వుండటం లో ప్రధాన పాత్ర పోషించింది మందల మల్లారెడ్డి. ( ఈ మధ్యలో వారు కీర్తి శేషులయ్యారు)అయినా వారి స్ఫూర్తితో అన్ని కులాల వారు కలిసి భాగస్వాములయి , కృష్ణాలయం నిర్మాణం చేస్తున్నారు.ఈ వూరిలో భక్తి భావన ఎక్కువ.
10.మానుకోట జిల్లాలో గూడూరు గ్రామంలో అన్ని కులాల వారు సామరస్య ధోరణితో జీవిస్తూ పండుగ లు జరుపుకుంటారు. శివాలయం పునరుద్ధరణ లో అందరూ సమితి గా ఏర్పడి కృషి చేస్తున్నారు. ప్రతి దసరా పండుగ రోజున 8 వేల నుండి 10 వేల మంది హాజరై సమైక్యత ను చాటి చెపుతున్నారు.
11.వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆత్మకూరు వివక్షత లేని గ్రామం.ఈ మధ్య నే గ్రామ పంచాయతీ లో స్వీపింగ్ పనిచేసే వారిని 10 మంది ని సన్మానం చేసి సామరస్యం చాటించారు.
12. వికారాబాద్ జిల్లా లోని కొత్త గడి గ్రామంలో జరిగే అమ్మవారి జాతర సమయంలో ఎస్ సి కులానికి చెందిన భక్తులు ముందు నడుస్తుంటే మిగతా భక్తులు వెంట నడిచి సమన్వయం కనబరుస్తారు.
13. సంగారెడ్డి జిల్లా లోని మల్కాపూర్ గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సురేందర్ రెడ్డి చొరవ తో అన్ని కులాల వారు దేవాలయం లో భజన చేస్తారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున వూరంతా ఒక్క చోట కూడి దసరా సందేశం విని, జమ్మిఆకు తీసుకుని వెళ్తారు.
14. కామారెడ్డి జిల్లాలో లింగంపేట గ్రామంలో అన్ని కులాల వారు దేవాలయం లో అర్చన చేస్తారు. బ్రాహ్మణులు అన్ని కులాల వారి పెళ్లిళ్లకు వెళ్లి వివాహ తంతు నిర్వహిస్తారు.
15.ఖమ్మం జిల్లాలో ఎస్ సి ఇళ్లల్లో కి హంపీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య స్వామీజీ వచ్చి, విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఇంటింటికీ వెళ్ళి దీపాలంకరణ చేసారు. శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి జీ పెనుబల్లి మండలానికి చెందిన 27 గ్రామాలలో పాదయాత్ర చేసి, అందరికీ దేవాలయ ప్రవేశం కల్పించి, సామరస్య సందేశం ఇచ్చారు.
16. గంగుల నాచారం గ్రామంలో ని గోండు, కోయ వంశానికి చెందిన యువకులు ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా వారి పూర్వీకుల ను గుర్తుకు తెచ్చుకుని పండుగలు జరుపుకుంటారు. వల్లభి గ్రామంలో సీతారామ దేవాలయ పూజారి మాదిగ వంశానికి చెందిన అనంత రాములు, రామచంద్ర బంజర గ్రామంలో శివాలయం పూజారి మాదిగ వంశానికి చెందిన సత్యం, రవి - ఇలా కులం ఏదైనా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు, అన్నదానం లో పాల్గొంటారు.
17. సిద్దిపేట కు దగ్గరగా వున్న ముత్యం పేట గ్రామము సంచార జాతి ప్రజలు నివసిస్తారు. విద్య పట్ల, సంస్కృతి ఆచారాల పట్ల ఆసక్తి లేకపోవడం, దురాచారాలు, మద్యపానం ఎక్కువగా వున్న ఇళ్లు అవి. లక్ష్మణ్ అను ఉపాధ్యాయుల ప్రేరణ తో చదువుపై అభిరుచి కలిగింది. గత రెండు సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా 7 రోజులు మద్యపానం నిషేధం. సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించి, మంచి మార్గం లో నడిచే ప్రయత్నం, ప్రక్కన వున్న అందె గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఆర్థిక సర్వే, సైకిల్స్ , పుస్తకాలు, నిత్యావసర వస్తువులు, చలి దుప్పట్లు పంపిణీ చేస్తూ ఆర్థిక, విద్యా, సాంస్కృతిక మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
18. లచ్చపేట(దుబ్బాక) గ్రామంలో శ్రీ కాంత్ అను యువకుడి ఆలోచన తో రాఖీ పండుగ రోజున రెండు సంవత్సరాల నుండి ఎస్ సి గృహాల నుండి యువకులు మిగతా కులాల వారి ఇంటికి, అలాగే మిగతా కులాల ఇంటి నుండి యువతీ యువకులు ఎస్ సి ఇళ్లకు వెళ్లి రాఖీలు కట్టి హిందువులం బంధువులం అంటూ వివక్షత లేని సమాజ నిర్మాణానికి కృషి జరుగుతున్నది.
19. అజయ్ శర్మ అను అర్చకుల సలహాతో మిడి దొడ్డి గ్రామంలో ముదిరాజుల ఇలవేల్పు అయిన పెద్దమ్మ గుడి లో దసరా నవరాత్రులకు కుల పెద్దమనిషి మేళ తాళాలతో ఎస్ సి కులం తో పాటు అన్ని కులాల వారిళ్లకు వెళ్ళి పూజలకు ఆహ్వానించడం సామరస్యతకు చిహ్నంగా పేర్కొనవచ్చును.
- అప్పాల ప్రసాద్.
సంక్రాంతి పండుగ రోజున ప్రకృతి లో వచ్చే మార్పుల వలెనే మనుషుల మనస్సు లలో కూడా మార్పు వచ్చినప్పుడు మాత్రమే నిజమైన సంక్రాంతి పండుగ వచ్చినట్లు అని పెద్దలు చెపుతారు.అటువంటి మార్పు తేవడానికి ఎందరో మంచి మనుషులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ReplyDelete