Breaking News

సంక్రాంతి సందర్భంగా సంచార జాతి ప్రజల జీవితాలలో మార్పుకు ప్రయత్నం


రాజపేట మండలం లోి నెమిల గ్రామానికి (భువనగిరి జిల్లా) చెంది కూడా ,ఊరి నుండి వెలివేసినట్లు ఒక కిలో మీటరు దూరంలో పడివున్న ఈ బస్తీలొ సంచార జాతి ప్రజలైన పిట్టలోల్లు నివసిస్తున్నారు.
సుమారు 45 కుటుంబాలు కలిగిన ఈ బస్తీ అనారోగ్యం, అవిద్య, పూరి గుడిసెలలో జీవనం, ఎండాకాలంలో వరుసగా మూడు నెలలు ( మార్చి, ఏప్రిల్, మే) నీటి కొరత, నెమిల గ్రామానికి నడవడానికి కూడా సరియైన రోడ్డు లేకపోవడం, మద్యపానం, మూఢనమ్మకాలు వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జనవరి కనుమ (సంక్రాంతి) పండుగ రోజున ఆలేర్ నుండి బండిరాజుల శంకర్, నెమిల నుండి సోమారం శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, అనిల్ తదితరులు వెళ్లారు. కనుమ పండుగ సందర్భంగా పిట్టలోల్ల ఇలవేల్పు అయిన ' దుర్గమ్మ ' చిత్రానికి అజయ్ శర్మ అర్చకులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి,మహిళలకు గాజులు, అమ్మవారి కుంకుమ అందజేశారు.
సుమారు 25 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు,15 మంది అంగన్‌వాడీ విద్యార్థులకు తోడ్పాటు అందించాలని ఆశించారు. ప్రభుత్వం శ్రద్ధ పెట్టి వారి వికాసానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక కార్యకర్తలు సాంస్కృతిక వికాసానికి సేవా కేంద్రాలు నడపాల్సిన అవసరం ఉందని సామాజిక సమరసత వేదిక గుర్తించింది.ఇప్పటికే ' సత్యసాయి నెమిల సంస్థ ' వారు పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.
నెమిల లో యువకుల ప్రయత్నం తో మంచి మార్పుకు శ్రీ కారం
నెమిల గ్రామ కులవృత్తుల వారికి సంక్రాంతి పండుగ సందర్భంగా సాయిబాబా ఆలయంలో సత్కారం కుర్మ,కుమ్మరి, కమ్మరి, వడ్ల,గౌడ,వడ్డెర, మంగలి, చాకలి, మాల,మాదిగ, జంగమ,వైశ్య, పద్మశాలి, పిట్టల, వంజరి తదితర పెద్దలను, గ్రామ యువకులు శాలువా తో గౌరవించడం వల్ల వివక్షత లేని దిశలో అడుగులు ప్రారంభమయ్యాయి.కార్యక్రమం తరువాత 'నువ్వులు తిని నూరేళ్ళు బ్రతుకు.. బెల్లం తిని తియ్యగా మాట్లాడు' అని పెద్దలు చెప్పినట్లు ప్రసాద వితరణ చేసారు.
ఈ కార్యక్రమ నిర్వహణ లో రాజు,రఘు,సిద్దు,అశోక్, కనకయ్య,బాల స్వామి, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- అప్పాల ప్రసాద్.

2 comments:

  1. సంక్రాంతి సందర్భంగా సంచార జాతి ప్రజల జీవితాలలో మార్పుకు ప్రయత్నం

    ReplyDelete
  2. PITTALOLLU - veellu chese pani emiti?

    ReplyDelete