Breaking News

హిందూ మతం (ధర్మం) నిత్య జీవిత గమనం-మన జీవన విధానం


హిందూ మతం (ధర్మం) నిత్య జీవిత గమనం. మన జీవన విధానం.

*హిందూ మతానికి మూలం భయం కాదు. అసహనం కాదు. మూఢ భక్తి కాదు. మతాధికారుల నిరంకుశత్వం లేదు.
ప్రేమ, జ్ఞాన వికాసం. ఆనందం, సత్యాన్వేషణ.ప్రశ్నించి జ్ఞానం పొందే అవకాశం.స్వేచ్చ వుంది. (ధృవుడు, ప్రహ్లాదుడు, నచికేతుడు, వివేకానంద, రామకృష్ణ పరమహంస ఇంకా ఎందరో సాధుసంతులు ప్రశ్నించి, సత్యాన్ని అన్వేషణ చేశారు.వీళ్లంతా పుస్తకాలు చదివి మతం గురించి తెలుసుకోలేదు.స్వయంగా సాధన చేసి సిద్ది పొందారు)

*ఉదయించే సూర్యుడితో ప్రతి రోజు తెళ్లారి, మనిషి జీవనం మొదలవుతుంది. (రాత్రి12 గంటల తరువాత 12 గంటల ఒక్క నిమిషానికి తెళ్లారదు కదా)

*ప్రాణాయామం, వ్యాయామం( బలమైన శరీరంలో బలమైన బుద్ధి వుంటుంది) 

*స్నానం సమయంలో నిత్య జీవ నదులను గంగా,యమున లను స్మరించడం (నీటి విలువ గ్రహించి పొదుపు గా వాడుకుంటూ, కాలుష్యం దరిజేరకుండా స్వచ్ఛంగా, పవిత్రంగా వుంచాలన్న సంకల్పం), 

*ఆక్సిజన్ అందించే తులసీ చెట్టు కు, అలాగే రావి,మర్రి, వేప,ఉసిరి చెట్లను కృతజ్ఞత ప్రకటిస్తూ పూజించటం( మొక్కలు నాటడం, చెట్లు పెంచడం పర్యావరణ పరిరక్షణ లొ భాగం కదా)

*జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించి నమస్కరించడం ( తల్లిదండ్రులు, గురువు, అతిథులను దైవం గా భావించి వారి నుండి సమాజ పరిజ్ఞానం గ్రహించి గౌరవించాలి కదా), 

*దేవతా విగ్రహాల ముందు తలవంచి, ధ్యానం, ప్రార్థన చేయడం, భోజనం చేసే ముందు భగవంతుని కి నివేదించడం (ఈ అనంతమైన సృష్టికి కారకులైన శక్తి స్వరూపం పట్ల విధేయత ప్రకటించడం వల్ల అహంకారం, పొగరుబోతు తనం కలుగకుండా జాగ్రత్త పడటమే కదా), 

*సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల గమనం ఆధారంగా పంచాంగం తో, కాల గణనతో తన జీవిత వికాసం కోసం గతం నుండి నేటి సమయం వరకు సంకల్పం చెప్పుకోవడం( సైన్స్ ఆధారంగా కాలం లెక్కింపు తప్ప మూఢ నమ్మకం కాదు)

*తన కుటుంబ సభ్యుల ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి , ప్రజల అవసరాలకు, దేశం కోసం నీతి నిజాయితీ లతో ఉద్యోగం,వ్యాపారం, వృత్తులు చేయటం , వ్యవసాయం, సైనిక విధుల నిర్వహణ ( నేను,నా కుటుంబం, నా దేశం, నా ప్రజలు అన్న భావనను పెంపొందించుకోవాలి కదా)

*అనాథలు,వృద్దులు, పేదవారిని విద్యా, వైద్య,ఆహార పరంగా సేవించడం ( మానవ సేవ మాధవ సేవ కదా). 

*మనం ఆచరించే పండుగలు దసరా,సంక్రాంతి, బతుకమ్మ, ఉగాది, బోనాలు జరుపుకుంటాం( ఇవన్నీ ప్రకృతి లో వచ్చే మార్పుల ఆధారంగా ఆరోగ్యం కోసం, స్వచ్ఛత కోసం, శారీరక, మానసిక,బౌధ్దిక వికాసం కోసం )

*మన మహనీయుల చరిత్ర చదివి, వారి అడుగుజాడల్లో నడవడం , ప్రతి మనిషిలో, ప్రాణిలో భగవంతుని దర్శించి, కుల మత ,ధనిక,పేద లకు అతీతంగా అందరిని గౌరవించే సంస్కృతిని ఆచరించడం,అందరికీ సమాన అవకాశం కల్పించడం( మన ఘనమైన వారసత్వ సంపద పట్ల గర్వం కలిగి , ఆ సంపద ను రక్షించడం మన కర్తవ్యం). 

*భగవంతుని దర్శించడానికి నిరంతర సాధన చేయడం,భగవంతుని నుండి వచ్చాము, మళ్ళీ ఆ భగవంతుని చేరాలన్న లక్ష్యం ( ముక్తి, నిర్వాణం, ఆత్మ సాక్షాత్కారం పొందటం).

*ఋగ్వేదం లో ఆయుర్వేదం, ధనుర్వేదం,వైద్య శాస్త్రం, శిల్ప శాస్త్రం, గణిత శాస్త్రం, భవన నిర్మాణ శాస్త్రం, ఇంజనీరింగ్ మొదలైన భౌతిక శాస్త్రాల వివరణ ఇవన్నీ ఏమి తెలియచేస్తున్నాయి?

*ఆధ్యాత్మికతతో పాటు భౌతిక అభివృద్ధి కి బాటలు వేసే విధానం మన హిందూ జీవన విధానమని అర్థం చేసుకోవాలి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. హిందూ మతం (ధర్మం) నిత్య జీవిత గమనం-మన జీవన విధానం

    ReplyDelete