' మతం మత్తు మందు ' అన్నాడు మార్క్స
' మతం మత్తు మందు ' అన్నాడు మార్క్స్ .
' మతం ఒక భ్రమ. అశాస్త్రీయమైనది' అంటాడు ఎంగెల్స్.
'విజ్ఞాన శాస్త్రం వల్ల మనిషి బాధలు తొలగుతాయి, మతం అవసరమే లేదు' అంటారు హెగెల్ మరియు ఫూయర్బెక్.
ఈ నలుగురు అంతగా ద్వేషంతో అసహ్యించుకునే ఆ మతం ఏది?
కచ్చితంగా హిందూ మతంకాదు.ఎందుకంటే వాళ్ల జీవిత కాలంలో హిందుత్వాన్ని అధ్యయనం చేయలేదు కనుక. వాళ్లు చదివింది, చూసింది క్రైస్తవాన్ని, ఇస్లాం ని, యూదు మతాన్ని మాత్రమే. "
కె. మార్క్స్ అండ్ ఎఫ్ ఎంగెల్స్ ఆన్ రిలీజియన్" అనే పుస్తకంలో రచయితలు హిందూ మతం నుండి ఒక్కగానొక్క ప్రస్తావన కూడా పేర్కొనలేదు.అసలు మతాన్ని ఎందుకు వ్యతిరేకించారు?
మహోన్నతమైన సైంటిస్ట్ లైన కోపర్నికస్, గెలీలియో, జాన్ కెప్లర్, బ్రూనో వంటి వారు క్రైస్తవ మతం ఐనా , మత పెద్దలు వారిని క్రూరంగా వేధించి, హింసించారు. చర్చి వారిని గుంజలకు కట్టి , మంట పెట్టి కాల్చిచంపారు.వాళ్ల పరిశోధనా పత్రాలను, గ్రంధాలను నిషేధించారు, నాశనం చేశారు.శతాబ్దాల పాటు తీవ్రమైన ద్వేషంతో సైన్స్ ని , ప్రజాస్వామ్య, సామ్యవాద ఉద్యమాన్ని అణగదొక్కింది.
ఇప్పుడు చెప్పండి. 'మతం ప్రజలకు మత్తుమందు ' అని మార్క్స్ చెప్పటం తప్పు కానేకాదు.ఆయన విమర్శలు సరైనవే. అయితే అది హిందూ మతానికి వర్తించదని అర్థమైంది కదా?
మా మతమే, మా దేవుడే గొప్ప అని, మిగతా మతాలు, ప్రజలు సైతాను లని,పాపులని, కాఫిర్ లని భావించే సెమెటిక్ మతాలతో , ప్రజలందరిలో భగవంతుని చూసే హిందూ మతాన్ని ఎలా పోల్చుతారు?
మార్క్స్ ఆ మతాల గురించి చెప్పింది , ఇక్కడి కమ్యూనిస్టు లు హిందూ మతానికి అన్వయించడంతో కమ్యూనిస్టు ఉద్యమం తప్పు త్రోవ పట్డింది.
మార్క్స్ ఇక్కడ జన్మించకున్నా, ఒకవేళ హిందుత్వాన్ని అధ్యయనం చేసి వుంటే తప్పకుండా భారత దేశ ప్రేమికుడిగా మారేవాడు. పాపం ఇక్కడ పుట్టిన కమ్యూనిస్టులు , హిందుత్వాన్ని సమగ్రంగా చదివే అవకాశం వున్నా, చదవని కారణంగా దేశ ద్రోహులయ్యారు.
- అప్పాల ప్రసాద్.
' మతం మత్తు మందు ' అన్నాడు మార్క్స
ReplyDelete