Breaking News

నా ప్రసంగాలకు హాజరై విన్న చాలా మంది నాయకులు


"నా ప్రసంగాలకు హాజరై విన్న చాలా మంది నాయకులు, తమకు నూతన వ్యవస్థ యొక్క పునాది ..హిందూ వేదాంతమే కావాలని అన్నారు ".- స్వామి వివేకానంద.


భారత దేశంలో పేదలకు, అట్టడుగు వర్గాలకు ఏ మిత్రులు ఉండరు. వారికి ఏ సహాయం అందదు.ఎంత ప్రయత్నించినా వాళ్లు పైకి లేవలేరు.క్రూర సమాజం తమపై వేసిన దెబ్బలను భరిస్తూ క్రుంగి పోతుంటారు. మన పతనానికి దారితీసిన కారణాలలో ఇదొకటి. 

వాళ్లలో అద్భుతమైన ప్రాణశక్తి వుంది. వాళ్లకు సగం రొట్టె ముక్కను ఇచ్చి చూడండి.. వాళ్ల శక్తిని పట్టి ఉంచడానికి ఈ ప్రపంచం చాలదు.సకారాత్మకమైన మంచి విద్యను వారికి అందించి జాగృతం చేయాలి.అందుకే స్వామీజీ 
'దరిద్ర దేవో భవ', 'దరిద్ర నారాయణుడు' అనే పదాలు సమాజానికి అందించాడు.

మన సమస్యలకు పరిష్కారం ఉన్నత స్థానములో వున్న వారిని పడగొట్టడం కాదు.దిగువన వున్న వారిని ఉన్నత స్థానానికి తీసుకుని పోవడం.అప్పుడు వాళ్లకు క్రమంగా ప్రత్యేక అధికారాలు లభించడం మీరు చూస్తారు" అని స్వామి వివేకానంద అంటారు. 
అప్పాల ప్రసాద్.

1 comment:

  1. "నా ప్రసంగాలకు హాజరై విన్న చాలా మంది నాయకులు, తమకు నూతన వ్యవస్థ యొక్క పునాది ..హిందూ వేదాంతమే కావాలని అన్నారు ".- స్వామి వివేకానంద.

    ReplyDelete