క్రాంతి అంటే విప్లవం
క్రాంతి అంటే 'విప్లవం'. అంటే , 'మార్పు' సరయిన పద్ధతిలో సమాజం లో జరిగితేనే , కాలానుగుణంగా వస్తున్న మార్పులకనుగుణంగా 'పరివర్తన' జరిగితేనే కలకాలం సమాజం జీవిస్తుంది. సంక్రాంతి పండుగ ఉద్దేశం కూడా ఇదే. హిందూ సమాజం కూడా వేల సంవత్సరాల కాలంలో జాడ్యం, వివక్షత, అంటరానితనం వంటివాటిని తొలగించేందుకు ఎందరో మహానుభావులు పుడుతూ పనిచేస్తున్నారు. ఆ మార్పు ఎప్పుడో అని ఎదురు చూసేవారు మంచి పని కోసం తలా ఒక్క చేయి వేస్తే అనుకున్న సమసమాజం వచ్చి తీరుతుంది. అవి ఇవి:
20.
భద్రాచలం పక్కన సారపాక గ్రామంలో వ్యాపారం చేసుకునే సూర్యకళ,సుబ్రహ్మణ్యం లు ప్రతి ఉగాది కి వారి ఇంటితో సంబంధం వున్న పాలు పోసేవారు, ఇంట్లో పనిచేసే వారు, మంగలిి ,చాకలి ఆ ప్రక్క, ఈ ప్రక్కన వున్న వివిధ కులాల వారిని దంపతుల తో సహా ఆహ్వానించి భోజనం పెట్టి, వస్త్ర దానం చేసి పంపుతారు.
21.
ఖమ్మం పట్టణం లో సాయిరాం బ్రాహ్మణ పురోహితుడు, ఎస్ సి వర్గానికి చెందిన లక్ష్మీ నారాయణ కుమారుడు వివాహం ఘనంగా నిర్వహించారు. ఎస్ సి వర్గానికి చెందిన వీరస్వామి, సాయిరాం పంతులు మంచి స్నేహితులు. లక్ష్మీ నారాయణ దంపతులు తమ కుమారులకు తాతలనాటి నుండి వస్తున్న హిందూ ఆచారాలను పాటిస్తూ క్రైస్తవులైన వారిని (గతంలో మతం మారినవారు) హిందూ పద్ధతిలో కోడళ్ళు గా స్వీకరించారు.
22.
సిద్దిపేట కు దగ్గరగా వున్న అందె గ్రామంలో ఎస్ సి వర్గానికి చెందిన 20-30 మంది యువకులు గతంలో చెప్పుడు మాటలొ, మిగతా కులాల వారి వ్యవహారాల వల్లనో గాని ఘర్షణల కు దిగి ఊరు రెండు గా చీలి వున్నప్పుడు, వివేకం తో రంగంలో దిగి అన్ని కులాల వారితో సత్సంబంధాలు నిర్మాణం చేయడానికి కృషి చేసారు. 1.వరుసగా మూడు సంవత్సరాలు శివరాత్రి పండుగను కలిపి జరపడం,2. స్వామీజీ పాదయాత్ర ద్వారా అందరం ఒకటే అన భావన నింపడం, 3. కులవృత్తుల వారికిి సత్కారం చేయడం 4. పాఠశాల విద్యార్థులకు ఉచిత బ్యాగులు పంపిణీ చేయడం 5. సంచార జాతి ప్రజలు ఉన్న ముత్యంపేట గ్రామంలో సర్వే చేయడం 6.ఆడపిల్లలకు సైకిల్ ల పంపిణీ చేయడం, అందె గ్రామంలో వున్న 30 మంది పేదవారిని ఎంపిక చేసి దుప్పట్లు వితరణ చేయడం- ఇలా సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణ లో భాగస్వామ్యం అవుతూ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
23.
రామాయంపేట వద్ద ఉన్న నార్లాపూర్ గ్రామంలో ఎస్ సి వర్గానికి చెందిన యువకులు 3 సంవత్సరాల లుగా ఊర్లో ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహణ, పాఠశాలలో బ్యాగ్ ల పంపిణీ, పేద వృద్ద దంపతులకు సహాయం, విద్యార్థుల సంస్కార కేంద్రాలు,ముగ్గుల పోటీలు, స్వామీజీ పాదయాత్ర లు, అంబేద్కర్ విగ్రహాన్ని అందరి ఆమోదం తో ఆవిష్కరణ ఇలా ఎన్నో సమాజం లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఊర్లో మార్పు కోసం వీరు చేస్తున్న కృషి ని గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.
24.ఆదిలాబాదు పట్టణం లో ఒక సంస్థ పేరు 'మానవ సేవ మాధవసేవ '. పసుపుల రాజు మొదలైన 20-25 మంది ఈ సంస్థలో సభ్యులై అనాథ ప్రేత సంస్కారం గత 3 సంవత్సరాలుగా చేస్తున్నారు. కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోని స్థితిలో వీరంతా చందాలు వేసుకొని శ్రద్ధతో వీరంతా ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు జరపడం వల్ల 'అశ్వమేధ యాగం చేస్తున్న పుణ్యం పొందుతున్నారు.
- అప్పాల ప్రసాద్.
క్రాంతి అంటే విప్లవం
ReplyDelete