పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 33 / 50
1971 డిశంబర్ 13,14,15 తేదీలలో బెంగళూరు పక్కన ఉన్న సోమనహళ్ళిలో మూడు రోజుల శిబిరం జరిగింది. 16 వ తేది పత్రికా విలేకరుల సమావేశం.
పాకిస్తాన్ ఇంకా ముక్కలవుతుందా? అని ఒక విలేకరి అడిగాడు. అందుకు శ్రీ గురూజీ ' నిస్సందేహంగా అలాంటి పరిస్థితి ఉందక్కడ. పశ్చిమ పాకిస్తాన్ నుండి వేలాది మైళ్ళ దూరంలోని తూర్పు బెంగాల్ , పాక్ నుండి ఇపుడు విడిపోయింది. పాక్ సైన్యంలో ఉన్న బలూచి మరియు పఠాణ్ గుంపులు స్వాతంత్ర్యాన్ని కోరితే అది మళ్ళీ నాలుగు భాగాలుగా విడిపోవడం ఖాయం. ప్రత్యేక ఫఖ్తూనిస్తాన్ కావాలనే కోరిక ప్రారంభం నుండి ఉండనే ఉంది. సింధ్ మొదట ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉండనేలేదు. ' ఇస్లాం ' ద్వేషాన్ని దూరం చేసి మానవులందరినీ సమానం చేస్తుందని ముస్లింలు వాదిస్తారు. అయితే పాకీలు తమలోతాము సమానత్వంతో ఉండలేరు. ఇపుడు పాకిస్తాన్ సమస్య మొదలైంది కూడా పశ్చిమ పాకిస్తాన్ ముస్లింలు మరియు పాకిస్తాన్ కు వలస పోయిన పశ్చిమ ఉత్తరప్రదేశ్ కు చెందిన ముస్లింలు తమకుతామే పరిపాలకులం అనే దర్పాన్ని ప్రదర్శిస్తున్నందునే ' అన్నారు.
పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు
ReplyDelete