Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 34 / 50

1967 లో శిరసి లో చికిత్స పొందుతున్న సమయంలో శ్రీ గురూజీ ని కలవడానికి ధార్వాడ జిల్లా సంఘచాలకులు అయిన శ్రీ నారాయణరావు టికారె వెళ్ళారు. ఆ సందర్భంలో ' జ్యోతిష్యం' యొక్క సత్యాసత్యతల గురించి వారిరువురి మధ్య చర్చ జరిగింది. 
శ్రీ టికారె : భవిష్యత్తు చెప్పడం సత్యమని భావించవచ్చా? 
శ్రీ గురూజీ : అవును. అయితే దాన్ని నిపుణులైన వారు మాత్రమే చెప్పగలరు. అందరివల్లా అది సాధ్యం కాదు. 
శ్రీ టికారె : ....అలాగైతే అంతా అయిపోయిందిగదా, చెప్పిన భవిష్యత్తు నిజమవుతుందనుకుంటే మనం ఏదో ఉద్యోగం లేదా పనిచేయడంలో అర్థమేముంది? జరిగేది జరిగే తీరుతుందని భావించి మౌనంగా కూర్చోవ
చ్చుగదా. ఉదాహరణకు ఇపుడు పాకిస్తాన్ ఏర్పడింది; అది నిలదొక్కుకుంది కూడా. విధి యోజన అనుసరించి అది సంభవించింది, ఇక అది మార్పు చెంద
దు అని తెలుసుకుని బిక్కమొహం వేసుకుని ఉందామంటారా? 
శ్రీ గురూజీ : భవిష్యత్తులో సంభవిస్తాయి అనే ఘటనలలో రెండు రకాలుంటాయి. కొన్ని మార్పు చెందగలవి మరియు మరికొన్ని మార్పు చెందనివి. సాధారణంగా 85 శాతము మార్పు చెందగలవు. 15 శాతము మాత్రమే మార్పు చెందవు. మార్పు చెందగలవు అనే వాటి 
మార్పుకు మును సూచన దొరికినపుడు వాటిని గ్రహశాంతి మూలంగా నివారించవచ్చు లేదా నిష్క్రియ పరచవచ్చు. భవిష్యత్తులో సంభవిస్తాయని 
తెలిసే ఘటనలలో మార్పు చెందుతాయి అనే వాటిని ప్రయత్న పూర్వకంగా మార్పుచేయగలము. అదే విధంగా మార్పు చెందవు అనే వాటియొక్క ఉగ్ర 
పరిణామాలను ప్రయత్నపూర్వకంగా సహించగల స్థితికి తీసుకురావడానికి సాధ్యమవుతుంది. స్వకర్మ ద్వారా , పరాక్రమం ద్వారా, పురుషార్థం ద్వారా 
మార్పు చెందవు అనే వాటి తీవ్రతను తగ్గించడానికి లేదా వాటి స్వరూపాన్నే మార్చడానికి సాధ్యం అవుతుంది.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 34 / 50

    ReplyDelete