పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 32 / 50
ఒకసారి శ్రీ బాబూరావు దేశాయ్ అనే విభాగ్ ప్రచారక్ శ్రీ గురూజీ ని ' నాడీ పరీక్ష ద్వారా రోగాన్ని పరీక్షించడం గురించి ఇలా ప్రశ్నించారు: నిజానికి అందులో యదార్థం ఉందా? మూడు విధాలైన నాడుల ద్వారా అన్ని రకాల రోగాలు గుర్తించడం ఎలా సాధ్యం? లేదా అందులో అంత: స్ఫూర్తి (Intuition) ద్వారా చెప్పేదే ఎక్కువగా ఉంటుందా? '. దానికి శ్రీ గురూజీ ' శాస్త్రమేదైనా అభ్యాసపు మొదటి దశలో 10 - 15 శాతం అంత:స్ఫూర్తితో చెప్పడానికే సాధ్యమవుతుంది. నాడీపరీక్ష కూడా ఒక శాస్త్రమే. శరీరంలో వాతం,పిత్తం, కఫం అనే మూడు ప్రకృతులున్నట్లే, త్రివిధ వేగం కల్గిన నాడులుంటాయి. మరియు వాటిలో ప్రతి ఒక్కదానికి తమదైన గుణాలుంటాయి. ఈ మూడింటి రకరకాల సంయోజనం మరియు కలయిక (permutations and combinations ) వల్ల వందల రకాల తేడాలు సంభవిస్తాయి. అందువల్ల అనేక రకాల రోగాల పరీక్ష చేయడానికి కూడా అవకాశం ఉంది. నేను స్వయంగా నాడీశాస్త్రాన్ని అభ్యసించాను. నాకూ ఆ విషయం తెలుసు ' అన్నారు.
- బ్రహ్మానంద రెడ్డి.
పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 32 / 50
ReplyDelete