Breaking News

యుగపురుషుని యుగాది గీతం

గుంటూరు లొ ఉండగా ఒక ఉగాదికి ముందు ఏకాత్మతా మానవతాదర్శనం

చదివి ఆ విభాగాలు రోజూ పాడుకునే విధంగా వ్రాయాలనుకొని కొత్త పాటకు ఉపక్రమించి ఈ విధంగా వ్రాసాను.


నవ యుగాదికి నాందీవచనము
నా జీవనమున నేడు చేయుదును
నవ భారత నిర్మాణ యజ్ఞమున
నేనొక సమిధగ ఆహుతి అగుదును
నాఈ దేహం నా ఈ బుద్ధి
నా ఈ మనస్సు నా ఈ ఆత్మ
నేనొక సాధన నేనొక శోధన
నవ చేతన నిర్మాణ పథాన
నా ఈ యశస్సు నా ఈ తపస్సు
న ఈ సంపద నేనె పూర్ణముగ
నాదొక ధ్యేయం నాదొక సాధ్యం
నేనె సాధనం సర్వస్వార్పణం#నవ భారత ని#
భారతమాత పదాల చెంతన
లేదు నాకొక స్వార్థ చింతన
సమాజ శివుని కైంకర్యాన
లేదు నాకొక సౌఖ్య జీవనము
సంఘటనమ్మను సాగరమందున
లేదు నేను నాదను భావనము
సంఘము నేను నేనె సంఘమను
అద్వైతామృత కర్మ పథాన #నవ
క్షణ క్షణ కణకణమూ జ్వలియంచిన
కేశవు జీవన కాంతి పుంజమున
మనమొక కిరణం మనదొక త్వరణం
మన జీవనమే సమాజార్పణం
మన ఈ తనువుతో మన ఈ కనులతో
మన భారతి వైభవము చూడగా
# నవ భారత నిర్మా#
ఈ పాట లొ రెండవ చరణం లో ..
సంఘమె నేను నేనె సంఘమను అనే మాట బౌద్ధక్ విభాగానికి నచ్చ లెదు.
మార్చి ఉపయోగార్హం అయితె, పాడు కంటే ధన్యుడను.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. గుంటూరు లొ ఉండగా ఒక ఉగాదికి ముందు ఏకాత్మతా మానవతాదర్శనం
    చదివి ఆ విభాగాలు రోజూ పాడుకునే విధంగా వ్రాయాలనుకొని కొత్త పాటకు ఉపక్రమించి ఈ విధంగా వ్రాసాను.
    నమస్సులతో మీ నరసింహ మూర్తి.

    ReplyDelete