నా తృతీయ వర్ష -6
ఒక రోజు రాత్రి (సంఘస్థాన్ తరువాత)
శిక్షార్థులందరిని కలిపి కూచొబెట్టారు. మాననీయ సుదర్శన్జి గొష్టి కార్యక్రమం
టాపిక్ ప్రారంభం చేసారు. దేశభక్తుడి గా జీవించాలంటే మనం ఏమి చేయాలి ?
అందరూ ఏవొ ఏవో చెప్పారు. రోజూ ఏకాఅత్మతా స్తోత్రం చదువాలని ఒకరు, అవినితిని అంతం చేయాలని ఒకరు, లంచగొండి కాకూడదని ఒకరు.
సుదర్శన్ జీ ప్రారంభించారు. స్వతంత్ర ఉద్యమం లో స్వదేశీ ఉద్యమం జదిగింది. అది స్వతంత్రం కోసమేనా? లేక అది జీవన పద్దతా? మరి దేశభక్తుడు స్వతంత్రం వచ్ఛాక కూడా అది దేశ భక్తుని జీవన పద్ధతి కావాలా, వద్దా? దేశభక్తులు చేయాలసింది లో ఇది ఒకటి అనుకోవచ్ఛా? అన్నారు. మన దేశం లొ మనం వాడాలి. విదేశీ వస్తువులు బహిష్కరించాలి.
ఇది మొదటి పని అన్నారు వారు.
రెండవది స్వభాష అన్నారు వారు. మన దేశం లో అనేక భాషలున్నయి. మరి మన భాష ఏది? మాతృభాష అంటే తల్లి తన పిల్లల కి నేర్పె భాష అని అర్థం. మన తల్లి భారతమాత. అమె నేర్పె భాషలన్ని మనకు మాతృ భాష లే. అంటె భారతీయ భాషలన్నీ మన మాతృభాషలే. అందుకె మన భాష మాట్లాడడం కూడ దేశ భక్తుడు గా మనం జీవించే పద్ధతి. జపాన్ దేశం టెక్నాలజీ ని కూడా తమ భాషలొ తర్జుమా చేసి వృద్ది చేసుకుంది.
ఆంటూఈ భాషలన్ని మనవి అనే భావన రావాలంటే మన ప్రాదేశిక భాషనే కాక మరొ మాతృభాషను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. హింది మిగతా భాషలవారికి వస్తునటుంది. కాని మనం మాట్లాడే భాష అంత స్పష్టంగా రావాలి. మరీ ముఖ్యం హిందీ మాట్లాడే వాడు కూడా మారో భాష నేర్చు కోవాలి. అంటూ వారికి స్పష్టంగా చెప్పారు. మన భాష మాట్లాడడానికి మనకు గర్వం కలగాలి.
స్వదేశీ, స్వభాష రెండు వ్రాసాను కాదా! మిగతావి రేపు రాస్తాను
నమస్సులతొ మీ నరసింహ మూర్తి.
సుదర్శన్ జీ ప్రారంభించారు. స్వతంత్ర ఉద్యమం లో స్వదేశీ ఉద్యమం జదిగింది. అది స్వతంత్రం కోసమేనా? లేక అది జీవన పద్దతా?
ReplyDelete