డా.అంబేడ్కర్ ను ఎందుకు గౌరవించాలి?-ఎలా అనుసరించాలి?
ఆధునిక భారత దేశంలోని ప్రొటెస్టంట్ హిందూ నాయకులలో మొదటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తన జీవితాన్ని హిందూ ధర్మ పునరుజ్జీవనం కోసం, హిందూ సాంఘిక వ్యవస్థ యొక్క పునర్వ్యవస్థీకరణ లో అంకితం చేశారు. హిందూ మతం, హిందూ సాంఘిక వ్యవస్థ లపై ధ్వజమెత్తడమే కాకుండా హిందుత్వాన్ని శుభ్రపరచి విప్లవీకరించిన వ్యక్తి. పునర్వ్యవస్థీకరించి చైతన్యవంతం చేశారు. హిందూ సమాజం శిథిలమై, దిగజారి పోకుండా రక్షించడానికి ఒక అపూర్వమైన మానసిక విప్లవానికి శంఖం పూరించాడు.
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే పునాదుల మీద హిందూ సాంఘిక వ్యవస్థ పునర్నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. కుల తత్వం నుండి, పూజారుల ఆధిపత్యం నుండి హిందూ సమాజం విముక్తం కావాలని కోరుకున్నారు.ఆయన చెప్పినట్లు గా నడిస్తే, హిందువులు స్వేచ్చా జీవులుగా, సజీవమైన, చైతన్య సమాజం గా రూపొందుతారు. ఆయన సిద్దాంతం ప్రకారం తన తోటి మతస్తులతో కలిసి జీవించడానికి హిందువులకు స్వేచ్ఛ వుండాలి.తమ దేశం, ధర్మం, భవిష్యత్తు లను నష్ట పరిచే సమస్యలను హిందువులందరు చర్చించుకునే అలవాటు వుండాలంటారు.
ఆయన సామాజిక సిద్ధాంతం కులతత్వాన్ని, అంటరానితనాన్ని నిర్మూలించి,హిందూ భావనను పునర్ జ్వలింపజేసి, హిందూ సమాజాన్ని సంఘటితపరచడానికేనని హిందువుల కు నచ్చచెప్పింది.షెడ్యూల్డ్ కులాల హిందువులకు ఆయన చేసిన సేవ ప్రపంచంలోని పేదలలోకెల్ల పేదలకు చేసిన సేవగా గుర్తించాలి. ఆయన కార్యం హిందూ సమాజ కార్యమని, దేశకార్యమని, మానవాళి కార్యమని అందరూ అర్థం చేసుకోవాలి.
( "డాక్టర్ అంబేద్కర్ - లైఫ్ అండ్ మిషన్ " పుస్తకం లో రచయిత ధనుంజయ ఖీర్. అంబేద్కర్ మీద వ్రాసిన పుస్తకాలు ఆయన చనిపోయిన తరువాత వ్రాయబడినవే. కాని 'లైఫ్ అండ్ మిషన్' పుస్తకం మాత్రం అంబేద్కర్ బ్రతికున్నప్పుడు ఆయన ఆమోదం తర్వాతే ముద్రించబడింది).
- అప్పాల ప్రసాద్.
"డాక్టర్ అంబేద్కర్ - లైఫ్ అండ్ మిషన్ " పుస్తకం లో రచయిత ధనుంజయ ఖీర్. అంబేద్కర్ మీద వ్రాసిన పుస్తకాలు ఆయన చనిపోయిన తరువాత వ్రాయబడినవే. కాని 'లైఫ్ అండ్ మిషన్' పుస్తకం మాత్రం అంబేద్కర్ బ్రతికున్నప్పుడు ఆయన ఆమోదం తర్వాతే ముద్రించబడింది.
ReplyDelete