Breaking News

మాననీయ సోమయాజుల నాగేశ్వర రావు గారు-చిరంతన స్ఫూర్తి

నేను ప్రచారక్ గా మానేసాక ఓ సారి విజయవాడ వెళ్లాను. అప్పుడు వారు సహప్రాంతా ప్రచారకులు. వెళ్ళింది ఆదివారం ఒక సీనియర్ కార్యకర్త ఇంట్లో పెళ్లి. నేను మా మామాగారు కలిసి వెళ్ళాము. చాలా మంది పలకరించారు. ఉదయమే విందులారగించి కార్యాలయం వచ్చాము.
11.30 అవుతుంది. నిక్కర్ వేసుకొని నాగేశ్వర్ రావు గారు నీరసంగా కార్యాలయం ప్రవేశించారు. వారి వద్ద నేను 3 సంవత్సరాలు పని చేసాను. బాగా చనువు ఉండేది. నాకంటే 12 సంవత్సరాలు పెద్దవారే. కాని నేనేమిటి వారు బాల స్వయంసేవకులకి కూడా దగ్గరి స్నేహితులే.

పెళ్ళికి రాలేదేమిటి నాగేశ్వర్రావు గారు? అంటూ ప్రశ్నించాను. 
పెళ్ళికి నీ లాంటి పెద్ద వాళ్ళు వెళ్ళాలోయ్, ఇప్పుడు నీవు సంఘ చాలక్ కూడా కదా! అంటూ నవ్వారు.
వారు నాపై జోక్ చేయడం నాకేమీ అనిపించలేదు. 
మళ్ళే అదే ప్రశ్న వేసాను.
ఈ మధ్య బాల పని చేయడం మన కార్యకర్తలు తగ్గించారోయ్. వారు కూడా దొరికేది ఆదివారమే కదా! నేను పెళ్ళికి రాకపోతే ఫర్వాలేదోయ్. కొంచం సేపు వాళ్లందరి ఇళ్ళకూ వెళ్లి వస్తున్నాను. 
వాళ్ళతో ఉంటె ఉత్సాహం వేరోయి.
రేపటి తరం వారే కదా! మిగతా కార్యకర్తలకు వేరే పనులున్నాయి. నేను
ప్రచారక్ ని నేను కూడా చేయక పోతే ఎలా? పెళ్లి బాగా జరిగిందా? ఎవరెవరు వచ్చారు? మాట మార్చేసారు.

నేను జవాబు చెప్పలేదు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిజమే ఈ పని తెలిసిన వాళ్ళం మనమే తృణీకరిస్తే ఎవరు చేయాలి? సంఘం లో స్వయంసేవకుల చేర్పు, పెంచడం మర్చిపోతే సంఘ వృక్షానికి కొత్త శాఖ లెలా వస్తాయి. చిన్న మాటలో పెద్ద పాఠం. వారు ఆచరించి చెప్పారు.
సంఘకార్యమేే నిర్మాణ కార్యక్రమం.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. మాననీయ సోమయాజుల నాగేశ్వర రావు గారు-చిరంతన స్ఫూర్తి

    ReplyDelete