ప్రచారకులంటే ఏ క్షేత్రానికయినా వెళ్ళాలి
సంఘ క్షేత్రం కాని పరివార క్షేత్రం కాని స్వచ్చందంగా తమ జీవితం సమర్పించిన ప్రచారకులు ఎక్కడికి సంఘం పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. అప్పటి దాకా ఉన్న పరిచయాలు, అలవాట్లు, నినాదాలు, పనిచేసే పద్ధతులు మారిపోతుంటాయి. కేటాయించిన పని ని తమదిిగా చేసుకొని అన్నీ నేర్చుకోవాలి. అవే మాటలు మాట్లాడాలి. అన్నింటిలో సమానంగా ఉండేది నేను భారత మాత సేవ సంఘం నిర్దేశించిన చోట చేస్తున్నానని తృప్తే.
మాననీయ సోమయాజుల నాగేశ్వర్ రావు గారు 40 సంవత్సరాల పైబడి సంఘ పనే చేశారు. నెల్లూరు నగర ప్రచారక్ గా, తూర్పు గోదావరి జిల్లా, విశాఖ, నెల్లూర్ విభాగ్ ప్రచారకులు గా తరువాత పూర్వాంధ్ర సహాప్రాంత ప్రచారక్ గా పని చేసిన వారికి శ్రీశైలం లో ఉండే శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ఇచ్చారు సంఘ పెద్దలు. ఆ కేంద్రం పని కోసం వారు అక్కడికి చేరుకున్నారు.
విశాలమైన శివాజీ దర్బార్ హాల్ పక్కగా ఒక యాత్రికుల సదన్ నిర్మించాలని నిర్ణయించారు. మూడంతస్థుల ఆ కట్టడం లో గదుల సముదాయానికి, వంట శాలకి, హాల్ కి ప్లాన్ వేయించాలి. నిర్మాణానికి డబ్బుల సేకరణ,సిమెంట్, స్టీల్ .. ఇత్యాదుల ఆలోచన ప్రారంభం అయ్యింది. దాని ప్లాన్ భాగ్యనగరం లో త్రిపురాంత రెడ్డి గారు చేస్తున్నారు. దాని స్ట్రక్చరల్ డిజైనర్ వీరంతా్ భాగ్యనగర్ లో ఉంటారు. వారు ఒకసారి వారిని కలిసి మాట్లాడాల్సి ఉండింది. వారు నాకూ స్నేహితులే. కాబట్టి కలిసి వెళదా మని నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను దిల్సుఖ్నగర్ భాగ్ సంఘచాలక్ ని.
వారు నాకు ఫోన్ చేసి నన్ను ఏమి చేస్తున్నావ్ అని అడిగారు. అప్పుడు నేను మా కార్యవహాగారు కలిసి మా జిల్లాలో బస్తీ ప్రముఖులను నిర్ణయించి వారితో ఆ పని విషయం మాట్లాడాలని వెళ్తున్నాము. వారికి అదే చెప్పాను.
సంఘం మారిపోయిందోయ్. నీవు సంఘ చాలక్, నీవు బస్తీ ప్రముఖులు, మండల్ కార్యవాహ్ లు అని మనుషులను కలిపే పని చేస్తున్నావు. నేను సంఘ ప్రచారక్ ని. నేనేమో ప్లాన్, డిజైన్, సిమెంట్, డబ్బులు ఆలోచిస్తున్నాము. పూర్వం ఈ బిల్డింగ్స్ పనులు సంఘ చాలకులు చూసే వారు. సంఘ కార్యానికి మనుషులు, జోడింపు, వెతుక్కోవడం ప్రచారకులు చేసే వారు. ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయ్యింది అంటూ నవ్వేసారు.
నిజమే! కార్యకర్తలు, కొత్త ప్రచారకులు, శాఖల విస్తరణ, దృఢీకరణ, వర్గలు, బౌద్ధికులు, పాటలు, చర్చలు, శారీరక్, ఘోష్, బైటక్ లు, ఇలా ఏళ్ళు పని చేసిన ప్రచారక్, పెద్ద భవనం కట్టడం వైపు పూర్తిగా మారిపోవడం- సంఘ నిర్దేశిత పనిలో తృప్తి ఉన్నా మొత్తం మారిపోతుంది. కాని సంఘ ప్రచారక్ నేర్చుకోవడానికి, నిర్వహించడానికి రెడీ.
సంఘానికి సర్ కార్యవాహ( ఆలిండియా జనరల్ సెక్రటరీ) గా పనిచేసిన ప్రచారక్ మాననీయ ఏకనాథ్ రానాడే జి, వివేకా నంద కేంద్రం, కన్యాకుమారి నిర్మాణానికి వెళ్లారు. సంఘ ప్రచారకులు దత్తోపంత్ జి కార్మిక రంగ యూనియన్లకు వెళ్లారు. నేర్చుకున్నారు. దేశం మొత్తం గుర్తించే సంస్థలను తయారు చేశారు.
సంఘం నిజంగా ఏ పనైనా సాధించడానికి కార్యకర్తలను, పని మెలకువలని తెలిసికోగలదు. నిలబెట్టగలదు, నేర్పగలదు.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.
ప్రచారకులంటే ఏ క్షేత్రానికయినా వెళ్ళాలి
ReplyDelete