Breaking News

రామాయణం నిత్యం మనలో కదలుతున్న అపురూప కథాచిత్రం-Ramayanam


రా' అంటే కాంతి, ' మా' అంటే నా హృదయం లో...నా హృదయం లో నెలవున్న .. రామా అంటే .. నాలో దాగి వున్న వెలుగు,ప్రతిభ,జ్ఞానాన్ని వెతుక్కోవడం...
దశరథుడు అంటే దశ అంటే పది..5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిసి వున్న రథం అంటే ఈ శరీరాన్ని, కౌసల్య అంటే నైపుణ్యం తో నడిపితే జన్మించినదే..ఆత్మ జ్ఞానపు వెలుగు( శ్రీ రాముడు )..
ఆత్మ సాధనలో మనస్సు(సీత) స్థిరంగా వుండాలి. కానీ, మనస్సు ని(సీత) అహంకారం (రావణుడు ) దొంగిలిస్తాడు. అప్పుడు ఆత్మారాముడు అశాంతి కి గురవుతాడు. అప్పుడు శ్వాస (హనుమంతుని) సహకారంతో , జాగరూకత (లక్ష్మణుడి) తో అహంకారం (రావణుని ) ను నిర్మూలించి మనస్సు (సీతను)ను ఆత్మ వద్దకు తీసుకుని వెళ్తే శాంతి లభిస్తుంది. జాగరూకతతో మనస్సును స్థిరంగా నిలిపి, శ్వాస(ప్రాణాయామము ) సహాయంతో మనలో వున్న ఆత్మారామున్ని దర్శించవచ్చును. ఇదే ఆధ్యాత్మిక, వేదాంత రామాయణం లోని సారాంశం.
'రామా ' అని పలికి,పలికి వాల్మీకి జ్ఞానోదయం పొంది, లోక క్షేమానికి రాముని కథను అందిస్తాడు.
'రామా ' అని ధ్యానించిన శబరి ముక్తి ని పొందుతుంది.
'రామా ' అని జపించిన అహల్య రాయి (జడత్వం )నుండి చైతన్యం పొందుతుంది.
'రామా ' అన్న నామ జపంతో వానరులు కష్టాల వారథి ని దాటుతారు.
'రామా ' అని శరణుపొందిన విభీషణుడు లంకా రాజ్యాన్ని ధర్మబద్ధంగా ఏలుతాడు.
'రామా ' అనటమే కాదు రామ కార్యం నిర్వహించి, హనుమంతుడు అందరి గుండెల్లో నెలవై వున్నాడు.
గమ్మత్తేమిటంటే రామా రామా యని ద్వేషంతో, కోపంతో వున్నంతకాలం నిద్రాహారాలు లేక మద, మాత్సర్యాలతో తలుచుకుని, హతుడై, రావణుడు చివరకు చేరింది రాముని వద్దకే అని ఎందరికి తెలుసు.?
 - Appala Prasad.

1 comment:

  1. రామాయణం నిత్యం మనలో కదలుతున్న అపురూప కథాచిత్రం-Ramayanam

    ReplyDelete