Breaking News

కష్టాలు సీతారాములకు... ప్రజలందరికీ సుఖాలు-రామాయణం


*లేక లేక జన్మించాడు రాముడు..
*ఇంటికి దూరంగా వశిష్ఠుడి ఆశ్రమంలో వేదవిద్య.
*తండ్రిి వద్దన్నా విశ్వామిత్రుడి తో కారడవికి వెళ్ళాడు.
*పెళ్ళి అయిందో లేదో రాజ్యాభిషేకం చేజారిపోయింది.
*సవతితల్లి కైక ,దాసి మంధర వల్ల కుటుంబం లొ చిచ్చు.
*14 ఏళ్లు అడవి లో జీవనం. రాజ్య సుఖాలకు దూరం.
*రోజూ అడవిలో రాక్షసులు, భయంకర మృగాల బాధలు.
*అడవిలో వున్నప్పుడే తండ్రి వేదనతో మరణం.
*భార్య సీతమ్మ అపహరణ, చెట్టు, పుట్టతో వేడికోలు.
*రావణుని తో యుద్దం, వేలాది వానరుల మరణం.
*ఎవరో ఏదో అన్నారని సీతమ్మను అడవిలో వదలటం.
*సీతమ్మ కు జన్మించిన లవకుశుల ప్రేమ కు దూరం.
*సీత బొమ్మ తో యాగం,కొడుకులతొ యుద్ధం.
*జీవితమంతా కష్టం..అయినా రాముడంటేనే ఇష్టం.
రామాయణం లో సీతా రాములకు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు , ఎన్నో అడ్డంకులు అయినా మనస్సు,బుద్ది అదుపు తప్పలేదు. ప్రశాంతంగా అందరితో క్రమశిక్షణ తో, ప్రేమ తో వ్యవహరించారు. ఎవరినీ పరుషంగా,కోపం తో తిట్టలేదు.హృదయం లోనే వేదనలు దిగమ్రింగారు.
రాముడు తండ్రి మాటపై నిలిచాడు. సవతి తల్లి కైకను కూడా పల్లెత్తు మాట అనలేదు.భరతుని అపహాస్యం చేయలేదు.లక్ష్మణుడికి అడుగడుగునా మార్గదర్శకంగా నిలిచాడు. గుహుడిని నిషాదరాజుగా ఆదరించి స్నేహం చేశాడు. ఋషులను,ఋషిపత్నులకు నమస్కరించాడు. హనుమంతుని మధురంగా పలకరించాడు. పక్షి జటాయువుని , శబరిని, సుగ్రీవుని , అహల్యను , విభీషణుని ఆశీర్వదించాడు. రావణుని రాజుగా గౌరవించి, రాయబారం నెరిపాడు. చివరకు హతమార్చి, స్వర్ణలంక ను ధర్మంగా విభీషణుడికిచ్చి, అయోధ్యకు పయనమయ్యాడు.
తనకు సహకరించిన వారి పట్ల కృతజ్ఞత చూపాడు.అన్ని జీవరాసులతో హితంతో మెలిగాడు. ఎవరి పట్ల అసూయ లేకుండా, తానే ముందుగా అందరినీ పలకరిస్తూ నడిచాడు. ప్రజలకు కష్టాలు రాకుండా పాలించి,రామరాజ్యం తెచ్చాడు.
( ఈ క్రింది నాణెపు బొమ్మ 1839 లో ఈస్టిండియా కంపనీ ముద్రించినది. ఈ నాణెములో సీతారామలక్ష్మణ,హనుమంతుని చిత్రం కనిపిస్తుంది. ఇది అణా నాణెము..అంటే అప్పట్లో ఆరు పైసలు ).
- Appala Prasad.

1 comment:

  1. కష్టాలు సీతారాములకు... ప్రజలందరికీ సుఖాలు-రామాయణం

    ReplyDelete