డా అబ్దుల్‌ కలాం ...... భారత మాతకు జయం తే...


రామేశ్వరం లో ని సముద్రంలో శ్రీ రామచంద్ర విగ్రహం నౌకలో తీసుకొని పోతున్న వేళ, ఆ విగ్రహం నీట మునిగినప్పుడు ,అబ్దుల్‌ కలాం గారి ముత్తాత సముద్రంలో దూకి ఆ విగ్రహాన్ని పైకి తెచ్చాడు. అప్పటి నుండి కలాం గారి కుటుంబం దేవాలయం లో అగ్ర తాంబూలం అందుకుంటున్నది.

ఇస్లాం రాక ముందు, క్రైస్తవం కంటే ముందు, మహా నాగరికత గా వెలసిల్లిన భారత సంస్కృతి కి చెందిన వారమని గర్విచాలని డా. కలాం అభిలషించారు.

మన దేశానికి స్వాతంత్ర్యం ఇంగ్లీష్ వాళ్లు కానుకగా ఇచ్చింది కాదని,ఏళ్ళ తరబడి నలిగిపోయిన తర్వాతే వచ్చింది, దాని రక్షణ బాధ్యత మనదే నంటారు.

మన ఇష్టాయిష్టాలకు, సౌకర్యాలను అనుభవించడానికి కాదు, దేశ భద్రత, ప్రజల సౌభాగ్యం, ప్రజల మధ్య సామరస్యం తేవడానికి కృషి చేయాలంటారు.

భారత దేశ పౌరులమనే మహత్తరమైన గర్వం తో ఈ జీవితాన్ని ముగించాలంటారు.

శక్తి, సంపద,సౌందర్యం కలిగిన దేశం ప్రపంచంలో ఎక్కడైనా వుందంటే, అది భారత దేశం అని చెప్పిన మాక్స్‌ముల్లర్ ని గుర్తు చేస్తారు, నా జాతి ప్రజలు ఐకమత్యం గా జీవిస్తూ, విభజన శక్తులను ఎదిరిస్తూ, వ్యక్తి కన్నా దేశం గొప్పదని భావించే టట్లు , సౌభాగ్య దేశం గా మార్చుకునే టట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తారు.

డా.సారాభాయ్‌, డా.హోమీబాబా, సివిరామన్, మదన్‌మోహన్ మాలవీయ, గాంధీజీ, జెఆర్ డి టాటా, ఫిరోజ్‌షా, రవీంద్ర నాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణ. స్వామి వివేకానంద వంటి శ్రేష్ఠ వ్యక్తుల ను ఆదర్శంగా తీసుకోవాలంటారు.

క్రీశ 476 లో కుసుమపురం ( నేటి పాట్నా, బీహార్‌ ) లో పుట్టిన ఆర్యభట్ట, 23 ఏళ్ళ కే గణిత శాస్త్రం లో నిష్ణాతులై II విలువ ను 3.1416 గా చెప్పిన సంగతి గుర్తు చేస్తారు.

క్రీశ 598 లో బిల్లమల్ల ( రాజస్థాన్‌లో ) పుట్టి, ఖగోళ శాస్త్రం ఆపోశనంపట్టిన బ్రహ్మ గుప్తుడు ( హర్ష చక్రవర్తి కాలం ) మనవాడే నని అంటాడు.

క్రీశ 1114 లో బిజ్జలవాడ ( కర్ణాటక ) లో జన్మించిన భాస్కరాచార్య సిద్దాంత శిరోమణి గ్రంథం వ్రాసి, ఆర్యభట్ట ప్రతిపాదించిన సున్నా విలువను బలంగా నిరూపించాడని అంటారు.

లెక్కలు పెట్టడం ఎలాగో నేర్పింది భారతీయులని, వైజ్ఢానిక ఆవిష్కరణ కు పునాది భారత దేశమని కీర్తించిన ఐన్‌స్టీన్ వాక్యాలు గుర్తు చేసి, కలాం విద్యార్థుల లో నమ్మకాన్ని పెంచుతారు.

అణు పరిశోధన వద్దని, ఆర్థిక వేత్త అమర్త్యసేన్ కామెంట్ చేసినప్పుడు, ఆర్థిక సంపన్నత తో పాటు దేశ సరిహద్దులను రక్షణ చేయటం కూడా అతి ముఖ్యమైనదని గట్టిగా వాదిస్తాడు.

అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు 10,000 చొప్పున అణుబాంబుల్ని కలిగి ప్రపంచాన్ని శాసిస్తుంటే, మన దేశం మౌన సాక్షి గా చూడదని, విశ్వాసం తో హుంకరిస్తారు.

అగ్ని, ఆకాశ్,త్రిశూల్,పృథ్వీ, నాగ్ లను స్వదేశీ పరిజ్ఞానం తొ తయారుచేసి, 1998 లో అగ్రదేశాల కన్నుగప్పి, పొఖ్రాన్ లో అణు పరీక్ష జరిపి, అణు సంపద ను దేశానికి అందిస్తాడు.

అస్సాం, ఝార్ఖండ్, త్రిపుర వంటి ప్రాంతాలలో లభించే ఖనిజాలను,తక్కువ ధరకు ఇతర దేశాలకు అమ్మడం మానేసి, రాకెట్లు, మిస్సైల్స్ ప్రయోగం లొ మన దేశంలో నే ఉపయోగిస్తాడు.

భూమ్మీద, భూమిపైన,భూగర్భంలో నూ ఏ వనరూ మనకు సాటి రాదని, కలాం చెప్తూ ఆర్థిక బలం తో పాటు విలువలు పాటిస్తూ ఆశయాలను పెద్దవిగా పెట్టుకొని ముందుకు నడవాలంటారు.

మన దేశం జ్ఞానభూమి,మహాశక్తి గా అవతరించాలంటే వ్యవసాయం,విద్యుత్, విద్యా,వైద్యం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, అణుశక్తి, రక్షణ రంగాల అభివృద్ది తప్పనిసరి అని కలాం అంటాడు.

జాతి కి సేవ చేయటానికి రైతు, ఉపాధ్యాయుడు, సైనికుడి పాత్ర అమోఘమైనదని వివరిస్తారు.

ఒక్క పువ్వు తో మాల అల్లలేము. అందరి హృదయాలను ఏకం చేయాలంటారు.

గొప్ప పరమార్ధం కోసం, మహోద్యమం కోసం ఉత్తేజాన్ని పొందితే, నీ ఆలోచనలు సంకెళ్ళు తెంచుకుంటాయి., నీ మనస్సు సరిహద్దులను అతిక్రమిస్తుంది., నీ చైతన్యం అన్ని దిశల్లొ విస్తరిస్తుంది. భారతీయ హృదయం చీకటి ని చీల్చుకొని తల పైకెత్తుకునే రోజు వస్తుందని, 1911లొ యోగి అరవిందుని వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయని డా కలాం విశ్వసనీయంగా చెప్పారు. జై భారత్, జై హింద్...
- Appala Prasad.

1 comment:


  1. మన దేశం జ్ఞానభూమి,మహాశక్తి గా అవతరించాలంటే వ్యవసాయం,విద్యుత్, విద్యా,వైద్యం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, అణుశక్తి, రక్షణ రంగాల అభివృద్ది తప్పనిసరి అని కలాం అంటాడు.

    ReplyDelete