Breaking News

వేదవిజ్ఞానం అందరి సొత్తు


వేదవిజ్ఞానం అందరి సొత్తు. ఏ కులం వారైనా శ్రద్ధ, భక్తి, సనాతన ధర్మం పై నిష్ఠ వుండే వారందరూ వేదం నేర్చుకోవాలి. తరతరాలుగా వస్తున్న వేదం లోని ఎన్నో గొప్ప అంశాలు కాలక్రమేణా మరుగునపడి అతి కొద్ది భాగం మాత్రమే మిగిలి వుంది. అది కూడా ఒక కులానికి పరిమితం చేస్తే ప్రపంచానికి అందించేది ఎలా? కృణ్వంతో విశ్వమార్యం..... ప్రపంచ ప్రజలందరినీ శ్రేష్టులుగా మలిచే ఒక గొప్ప కార్యం భారతీయులందరిపై వుంది.

వేదాలు అధ్యయనం చేసి, ఆర్యులు వేదాలను బయటనుండి వస్తూ వస్తూ తెచ్చారని అబద్ధాలు చెప్పి దేశాన్ని తప్పు దారి పట్టించిన ఘనుడు మాక్సుముల్లరు ..అయితే అవే వేదాలు చదివి, ఆర్యులు ఈ దేశంలోని మూలవాసులేలని, బయట నుండి రాలేదని గట్టిగా నొక్కి చెప్పిన దేశభక్తుడు డా బిఆర్ అంబేద్కర్ ..
వేదాంతం ప్రపంచ ప్రజల కు వివరించడానికి ఒకప్పుడు విశ్వం చుట్టి వచ్చిన ఋషి అగస్త్యుడు .అయితే..
అదే విజ్ఞానాన్ని 120 సంవత్సరాల క్రితం ప్రపంచానికి విప్పి చెప్పిన ఆధునిక ఋషి స్వామి వివేకానంద ...

అంతేకాదు..4000 వేల మందిని జీసస్ ని మాత్రమే ఆరాధించే వారిని తన శిష్యులుగా మార్చుకున్నారు. వేదాంతం లోని విశ్వ రహస్యాలను విప్పి చెప్పారు. మరి మన దేశంలో వివక్షత ఎందుకు? యజుర్వేద మంత్రాల తో గర్భగుడి లో భగవంతుని ఆరాధించే వారు అర్చకులు... అయితే సామవేద గానంతో సన్నాయి వాద్యాలు మ్రోగించే వారు మంగలులు..

అన్ని కులాలకు గుడి నిర్వహణలో బాధ్యతలున్నాయి.భక్తి వుంది. దేవాలయం భూములలో వాటాలున్నాయని చరిత్ర చెపుతుంది. భగవంతుని కొలవడంలో, యజ్ఞ యాగాదుల నిర్వహణలో, ఆయుధాల నిర్మాణంలో , గణితంలో , మానవతా దర్శనం లో కేవలం హిందువులకే కాదు, ప్రపంచంలోని మానవులకు ఉపయోగ పడేది వేదం. వేదం సాధన కష్టం. అదే రాగంలో, అదే పద్ధతిలో, అదే సంస్కృతభాషలో , ప్రపంచంలోని అన్ని మూలలా గురువుల ద్వారా వేల సంవత్సరాలు గా ఇప్పటికి కొనసాగటమే పరమాధ్భుతం. జర్మనీలో విశ్వనాథశాస్త్రి అనే వేద పండితుడిని తీసికొని వెళ్ళి , ఆధునిక విజ్ఞానాన్ని గ్రహించారు. ఆ పండితుడి ఫోటో ను గుర్తుగా గోడకు వ్రేలాడ దీశారు. అమెరికా నాసా అంతరిక్ష పరిశోధన శాలలో భారతదేశం నుండి భరద్వాజుని విమాన శాస్త్రం ముంబాయి నుండి తెప్పించుకుని చదివారు. ఇంగ్లండులో ఎక్కువ పాఠశాల ల్లో సంస్కృతం నేర్పి, వేద మంత్రాలు వల్లె వేస్తున్నారు.

మహర్షి దయానంద మార్గం లో నడుస్తూ, మెదక్ జిల్లా జహీరాబాద్ దగ్గరలోని బర్తీపూర్ ఆశ్రమంలో అందరికి నేర్పిన, నేర్పుతున్న వేదవిద్య అందరికీ అందుతుంది. అందరికీ అందిన ఆ విజ్ఞానం ప్రపంచానికి మేలు చేస్తుందని ఆశిద్దాం.
- Appala Prasad.

1 comment:

  1. వేదవిజ్ఞానం అందరి సొత్తు

    ReplyDelete