రాజా కున్వర్ సింగ్ (Raja Kunwar Singh)
రాజా కున్వర్ సింగ్ (1777-1858)
80 ఏళ్ళ వయస్సులో ఆంగ్లేయులను చెమట పట్టించిన వీరుడు.బిహార్ లోని జగదీష్పూర్ రాజైన కున్వర్ సింగ్ , శివాజి తరువాత గెరిల్లా యుద్ధం లో ఆరితేరిన వాడు.జులై 5,1857 న దానాపూర్ లొ అంగ్లేయులను ఎదిరించాడు.ఒక సంవత్సరం పాటు యుద్ధం చేసాడు..ఒకసారి గంగా నది దాటుతూ వుంటే అంగ్లేయులు పేల్చిన ఒక తూటా అతని భుజానికి తగిలింది.వెంటనే తూటా తగిలిన అతని చేయి ఇక పనికి రాదని ఆ చేయిని కత్తితో నరికి గంగా నదికి నైవేద్యంగా సమర్పించాడు.
ఇంగ్లిష్ కెప్టెన్ లి గ్రాండ్ నాయకత్వంలో వచ్చిన బ్రిటిష్ సైన్యాన్ని 23 ఏప్రిల్,1858 లో ఓడించి,ఊనియన్ జాక్ పతాకాన్ని దించి జగదీష్ పూర్ కోటపై మన ఝండా ఎగర వేశాడు. ఏప్రిల్ 26 ఏప్రిల్,1858 లో కున్వర్ సింగ్ మరణించాడు. 1992 లొ బిహార్ లో ఆ వీరుడి పేరుతో వీర కున్వర్ యూనివర్సిటీ ని స్థాపించారు.
- అప్పాల ప్రసాద్.
రాజా కున్వర్ సింగ్ (Raja Kunwar Singh)
ReplyDelete