భగవద్గీత-7
(ఋ)
పనులు తప్పకుండా చేయవలిసిందేనా?
ప్రశ్న.31..ఏ పనీ చేయకుండా వుండలేను. చేస్తేనేమో కోరికలు,ద్వేషాలు పుడుతున్నాయి.ఎలా?మోక్షం వస్తుందా?
జవాబు...కోరికలు,ద్వెషాలు తగలకుండా పనులు చేయాలి.మహాత్ములు అలానే చేస్తారు..ఇది మన కర్తవ్యమని భావించాలి తప్ప,రాగం,ద్వెషాల గురించి ఆలొచించవద్దు.
ప్రశ్న 32..పని చేయటం మంచిదని కొందరు(కర్మ యోగం),జ్ఞానం పొందటం మంచిదని కొందరు(జ్ఞాన యోగం),భక్తి ముఖ్యమని కొందరు (భక్తి యోగం) అంటుంటారు. నాకు వీటిని పరిశీలించే శక్తి లేదు.నా పని నాది చేసుకుని పోవటం మాత్రమే నాకు తెలుసు..
జవాబు...అందరికీ ఒకే మందు ఎలా పని చేయదో,అలాగే వాళ్ళ వాళ్ళ యోగ్యత,అవసరాలను బట్టి, వాటిని గుర్తించాలి.అవన్నీ గొప్పవే..పై మూడు పనులు అనాసక్త యోగంతో ఆచరించాలి.
ప్రశ్న..33..శివాజి మొదలైన వీరులు రామాయణ,భారతాల్లో నుండి ప్రేరణ పొందారు.నిజమేనా? ఆ జీవిత చరిత్రలు చదివితే సమస్యలనెదిరించవచ్చా?
జవాబు..ఆ మహా పురుషుల అడుగుజాడల్లో నడిస్తే మనకు ప్రగతి కలుగుతుంది.ఈ సమాజం ఎప్పుడు కూడా ఉత్తమ ఆదర్శాలు కలవారిని అనుకరిస్తుంది.
ప్రశ్న..34.రాముడు,కృష్ణుడు సామాన్యుల మాదిరిగా గురుకులాల్లో ఎందుకు చదివారు?భర్య కొసం ఎందుకు విలపించారు?వాళ్ళ కథలు చదివితే మనకేమి ప్రయోజనమని నా మిత్రుడు ప్రశ్నిస్తున్నాడు.
జవాబు..రాముడు,కృష్ణుడు మానవులు అనుసరించవలసిన పద్ధతుల కొసం అవతరించారు.మనకు ఆత్మశక్తి,నైతిక శక్తి పెరిగే జీవనాన్ని మనకు చూపించడానికి ఈ భూమి మీద జన్మించారు..వాళ్ళ కారనఝన్ములు..మనం ప్రరబ్దంతో పుట్టినవాళ్ళం.
ప్రశ్న.35..నేను శస్త్రాలు చదివాను.సాధువులను,తీర్థాలను సందర్శించాను.నేను ఎకాంతంగా ధ్యానం చేసుకుంటాను.పనులు చేయను అని కొందరంటీ అది కరక్టేనా?
జవాబు...కాదు.పనులు తప్పకుండా చేయాలి.ప్రజలకు ఆదర్శంగా వుండటానికి పనులు చేయవలిసిందే..
(భగవద్గీతలోని 3వ అధ్యాయం లోని 19,20,21,22,23,24,25 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి ఈ సందేశమిస్తాడు).
- అప్పాల ప్రసాద్.
(భగవద్గీతలోని 3వ అధ్యాయం లోని 19,20,21,22,23,24,25 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి ఈ సందేశమిస్తాడు).
ReplyDelete