భగవద్గీత-8
(లు)
నేను మనసుతో,మాటతో,శరీరంతో మంచి పని ఒక్కటి కూడా చేయలేదు.నా గతి ఏమిటి?
ప్రశ్న..41.నేను చేసిన పనులకు ఫలితాలు ఎలా వున్నా,వాటి బంధం నాకు అంటకుండా వుండాలంటే ఏమి చేయాలి.
జవాబు..భగవంతున్ని ధ్యానించాలి.పనులు చేసే శక్తి వస్తుంది.ఆ బంధం నీకు అంటదు.
ప్రశ్న..42.పండితుడు అంటే ఎవరు? ఎలా వుండాలి?
జవాబు..మనం దానం చేస్తే ఇతరులకు మేలు కలిగితే మరో జన్మలో మనకు మేలు జరుగుతుంది.దానం చెసినందుకు మనకు సంతృప్తి కలిగితే,అది సంస్కారంగా బీజరూపంలో వుండి పోతుంది..మంచి చేతే,చెడు చేస్తే చెడు అవుతుంది.ఈ రెండు రకాల ఫలితాలను వదిలిపెట్టడమే వివేకంతో కర్మలను నాశనం చేయటం...అలా చేసుకున్నవాడే పండితుడు.
ప్రశ్న.43..పనులు చేయటం తప్పదు..దాని ఫలితాలు వుండక తప్పదు..ఎలా?
జవాబు..ఆశను వదలి నిత్యకృత్యాలు చేస్తే చాలు.మంచి,చెడ్డలను భగవంతునికి వదలివేయండి..
ప్రశ్న..44..ప్రపంచంలో మహాత్ములు వుంటారు..వారినుండి ఏమి పొందాలి?
జవాబు...ఆ మహాత్ములకు విధేయులుగా వుండి,వారి నుండి జ్ఞానాన్ని పొందాలి.
ప్రశ్న..45..నేను మనసుతో,మాటతో,శరీరంతో మంచి పని ఒక్కటి కూడా చేయలేదు.నా గతి ఏమిటి?
జవాబు...నీవేమి భయపడవలసిన అవసరం లేదు.వాటినుండి నీకు విముక్తి లభిస్తుంది.నీవు నిజంగా పశ్చాత్తాపం పొందు.జ్ఞానమనే తెప్పతో ఈ పాపసాగరాన్ని దాటొచ్చును.
(భగవద్గీతలోని 4వ అధ్యాయంలోని 14,19,20,21,22,34,36 శ్లోకాల ద్వార శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ సంగతులు చెపుతాడు).
- అప్పాల ప్రసాద్.
(భగవద్గీతలోని 4వ అధ్యాయంలోని 14,19,20,21,22,34,36 శ్లోకాల ద్వార శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ సంగతులు చెపుతాడు).
ReplyDelete