Breaking News

భవద్గీత-6


(ౠ)
నా ధర్మం వదిలిపెడితే ఏమవుతుంది?

ప్రశ్న.36..ఆయన బాగా చదువుకున్నాడు.ఉపన్యాసాలు బాగా ఇస్తాడు.గొప్ప పేరు వుంది..కాని వున్నట్టుండి చికాకు పడతాడు.ఆవేదన పడతాడు.ఇంత చదివినా కూడా స్వభావం మారదా?

జవాబు..ఈ విజ్ఞానం మధ్యలో వచ్చింది.స్వభావం ప్రకృతిసిద్ధంగా వచ్చి బలమైంది.అందుకే నిగ్రహముంటేనే అవన్నీ తగ్గుతాయి..

ప్రశ్న..37.నా పూర్వీకులు ఎన్నొ సమస్యలనెదుర్కొని ఈ ధర్మాన్ని మాకు అందించారు.నాకు ఈ ధర్మం కంటే ఇతర ధర్మాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.నా మిత్రులు కొందరు పరధర్మాన్ని స్వీకరించి హాయిగా వున్నట్లు అనిపిస్తున్నది.నేను ఏమి చేయాలి?

జవాబు..ఇటువంటి సమయంలో నీ వివేకం ఉపయోగించాలి.మన తాత ముత్తతలనుండి వచ్చిన ధర్మాన్ని వదిలేసి,కొత్త ధర్మం తీసుకుంటే అది తెలవడానికి ఒక జన్మ సరిపోదు.అది భయంకరమింది.చస్తే మన ధర్మలోనే చావాలి కాని పరధర్మం వద్దు.మన ధర్మం లోని గొప్పతనం తెలుసుకోవాలి.

ప్రశ్న.38..మనం పాపాలు ఎందుకు చేస్తాము.చేయకుండా వుండలేమా?

జవాబు...దురాశ తో కూడిన కోరికలు ఆ తరువాత కోపం ...ఈ రెండే అన్ని పాపాలకు మూల కారణం.వీటిని తొలగించుకోవాలి..

ప్రశ్న..39..ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్యాయం,అధర్మం వుంది..మంచివారు బ్రతకలేక పోతున్నారు.ఏమిటి దారి?

జవాబు...దారి ఎందుకు లేదు? ఇలాంటి సమయాల్లో తాను ఆ బాద్యతను స్వీకరిస్తానని భగవంతుడే స్వయంగా చెప్పాడు కదా?ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి మనం కూడా దోహదపడాలి..

ప్రశ్న..40.శివుడు గొప్పవాడని కొందరు,విష్ణువు గొప్పవాడని కొందరు వాదిస్తున్నారు..ఎవరిని పూజించాలి?

జవాబు..ఎవరిని పూజించినా చేరేది ఆ భగవంతునికే..వైరుధ్యమున్నవన్నీ రాజకీయాలు తప్పితే మరేమీ కాదు..అది అజ్ఞానం మాత్రమే.

(భగవద్గీతలోని 3వ అధ్యాయం లోని 33,35,37, 4వ అధ్యాయంలోని 7,8,11,అలాగే 9వ అధ్యాయంలోని 23 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి హితబోధ చేస్తాడు.)
- అప్పాల ప్రసాద్.

2 comments:

  1. (భగవద్గీతలోని 3వ అధ్యాయం లోని 33,35,37, 4వ అధ్యాయంలోని 7,8,11,అలాగే 9వ అధ్యాయంలోని 23 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి హితబోధ చేస్తాడు.)

    ReplyDelete
  2. Well explained Prasad garu

    ReplyDelete