భగవద్గీత-3
చేసే పనులు పూర్తి కాకపొతే ఎలా?
ప్రశ్న.16
నేనొక పని చేయబోతున్నాను.లాభమొస్తుందో,నష్టమొస్తుందో నని ,విజయమో,అపజయమోనని మనసులో ఒకటే అందోళన.తప్పుడు మార్గాలు అనుసరిస్తే పరవాలేదా? ఏది దారి?
జవాబు...ఆందొళన పడితే విజయం కలుగదు.లాభమ..నష్టమా అది ముందే కాచుకుని వుంది.తప్పుడు మార్గాలు అనుసరిస్తే దుఖం తప్పదు.భగవంతుని ప్రసాదంగా నీ పని చేయి అంతే..
ప్రశ్న.17. ఒక పని చేద్దామని నిర్ణయించుకున్నాను.ఆ తరువాత బాగాలేదని నిర్ణయం మార్చుకున్నాను.అది మంచి పనేనా?
జవాబు...దేశం,కాలం,పాత్ర..లను బట్టి,బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి.ఆ తరువాత దాన్ని మార్చొద్దు.అలా మారుస్తూ పొతుంటే ఎవరూ సలాహాలివ్వరు.స్థిర సంకల్పంతో వుండు.విజయం నీదే.
ప్రశ్న.18.నా ప్రయత్నం ఫలించింది..అహంకారం కలిగింది.ఆ తరువాత ప్రయత్నాలకు దెబ్బ తగిలింది.దైవాన్ని,లోకాన్ని నిందించాను.ఇది సరియైనదేనా?
జవాబు...ఫలితం వస్తే ఉబ్బితబ్బిబ్బవడం,అహంకారపడటం,పని కాకపొతే నిందించుకోవటం నీ బలహీనత.ఫలితం ఎలా వున్నా నీ పని చేసుకుంటూ పోవాలి.అప్పుడే శాంతి లభిస్తుంది.
ప్రశ్న.19.ఎంత లాభం వస్తుంది..అని ముందే అంచనాలు వేసుకుని పనిలోకి దిగటం నాకు అలవాటు.ఏ పని మొదలుపెట్టినా మంచి జరగటం లేదు.దాంతో ఆందోళన.అసమర్థత పెరిగింది.ఎలా?
జవాబు...ప్రయోజనాన్ని ఆశించి పనిలో దిగటమే తప్పు.ఫలితం తలక్రిందులైతే ఆందోళన పడతారు.ఫలితం ఎలా వున్నా సమభావంతో వుండు.
ప్రశ్న.20.నేను చేసే పని మంచిదో,చెడ్డదో తేల్చుకోలేక పోతున్నాను.దాంతో ఏ పని కూడా సరిగ్గా చేయటం లేదు.
జవాబు...ఫలితం ఎలా వున్న పని చేసుకుని పో..ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతుని మీద వేయి..అప్పుడు మనస్సు నెమ్మదిగా వుంటుంది.
(భగవద్గీత 2 వ అధ్యాయం లో 38,41,47,48,50 శ్లోకాలు కృష్ణుడు అర్జునునికి చెప్పి ధైర్యం నింపుతాడు.)
- అప్పాల ప్రసాద్.
(భగవద్గీత 2 వ అధ్యాయం లో 38,41,47,48,50 శ్లోకాలు కృష్ణుడు అర్జునునికి చెప్పి ధైర్యం నింపుతాడు.)
ReplyDelete