Breaking News

భగవద్గీత-4


(ఇ.)
జీవితంలో భయం వేస్తే ఏమి చేయాలి?

11.ప్రశ్న.పుట్టినవాడు చనిపోకుండా ఎవరైనా ఇప్పటివరకు వున్నారా?చనిపోయినవాడు పుట్టకుండా వుండగలడా? చస్తే ఎందుకు బాధ పడతాం?

జవాబు..పుట్టాడు..అంటేనే చావటం ఖాయం..అని అర్థం.చనిపోయినవాడు మళ్ళీ పుడతాడు.ఐతే ఎవరికైనా మోక్షం లభిస్తే మాత్రం పుట్టుక వుండదు.ఈరోజు అన్ని దేశాల్లో పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడానికి సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయి.శరీరం వదలి మరోచోట పుట్టేవాడి గురించి బాధ ఎందుకు.?

12.ప్రశ్న..ఎవరైనా చనిపోతే లోకంలో అతని గురించి కొంతసేపు వింతగా,ఆశ్చర్యంగా చెప్పుకుంటారు.ఆ తరువాత కొద్దిరోజుల తరువాత మరిచిపోతారు. చిత్రంగా లేదూ?

జవాబు..అవును.మరణిస్తే ఆశ్చర్యమే..జ్ఞానం నిలవక అజ్ఞానం ఆవరించి,ఆ విధంగా ఆశ్చర్యపోతారు.

13.ప్రశ్న..మా చుట్టుపక్కలవారు అనవసరంగా వైరాన్ని పెంచుకుంటున్నారు.బాగా చికాకు పెడుతున్నారు.అధర్మం పెరిగిపోతున్నది.వీళ్ళ వ్యవహారం చూసి ఏమి చేయాలో తోచటం లేదు.

జవాబు..నీ స్వార్థం కంటే బాధ్యతకు,పరోపకారానికి ప్రాధన్యత ఇవ్వు.వాళ్ళ చికాకుని చూసి బెదిరిపోయి,పారిపోవద్దు.

14.ప్రశ్న.నేను మొదటినుంచి ఆదర్శంగా జీవించాను.సమాజానికి సేవ చేశాను.పేరు కూడా వచ్చింది.కాని కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చి,ధర్మాన్ని తప్పుతానేమోనని,భయం వేస్తుంది.

జవాబు..ఒకసారి జీవితంలో చక్కని గౌరవం పొందిన వారు తిరిగి అగౌరవం పొందటం మరణం కంటే నీచమైంది.కాబట్టి ధైర్యంగా ఎదుర్కో..

15.ప్రశ్న..ఏ పని చేద్దామన్నా ముందు నుయ్యి,వెనక గొయ్యి లాగా వుంది నా పరిస్థితి.ఈ వ్యతిరేక వాతావరణంలో ఏమి చేయాలి.?

జవాబు...దైవం అనుకూలిస్తే పరవాలేదు..అలా కాకపోయినా సక్రమంగా చెసినవాడిగా వుండిపోతావు.కాలం నీ పరిస్థితుల్న్ని చక్కపరుస్తుంది.

(భగవద్గీత లోని 2వ అధ్యాయంలో 27,29,31,34,37 శ్లోకాలతో అర్జునునికి కృష్ణుడు ధైర్యం చెపుతాడు).
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. (భగవద్గీత లోని 2వ అధ్యాయంలో 27,29,31,34,37 శ్లోకాలతో అర్జునునికి కృష్ణుడు ధైర్యం చెపుతాడు).

    ReplyDelete