భగవద్గీత-2
(ఆ.)
ఆత్మల గురించి చాలా మందికి అనుమానాలుంటాయి.అవి ఏమిటి.?
6.ప్రశ్న..చచ్చిన తరువాత శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా.అటువంటప్పుడు మంచి పనులు ఎందుకు చేయాలి?.శరీరం ఎలాగూ వుండదు కదా? ఏదైనా ఆత్మ అనేది వుందా?మరి శరీరంపైన అందరికి మోజు ఎందుకుంటుంది?
జవాబు..శరీరం అంటే అర్థం నశించేది అని..పర్మనెంట్ మన ఆత్మ.మంచి,చెడు ఈ రెండూ కూడా శరీరం పోయినా ఆత్మను పట్టుకుని వుంటాయి..అందుకే పుణ్య పాపాలు కలుగుతాయి.అందుకే మంచి చేయాలి.ఇదే జీవితం.
7.ప్రశ్న..ఒకడు ఇంకో వ్యక్తిని చంపుతుంటాడు కదా. ఇది నిజమేనా? ఆత్మ చచ్చిపోతుందా?
జవాబు..ఒక శరీరం వదలి ఇంకో శరీరంలొకి వెళ్ళడానికి ఒక కారణం వుండాలి కాబట్టి,పైకి చంపడం లా కనిపించినప్పటికినీ ఆత్మ కు చావు వుండదు.
8.ప్రశ్న.మరి లోకం లో మనిషి పుడుతున్నాడని,చస్తున్నాడని అంటారు కదా..ఇది ఎలా సాఢ్యం? ఆత్మకు పుట్టుక వుండదా?
జవాబు..శరీరంలో ఆత్మ ప్రవేశిస్తే పుట్టుక.ఆత్మ విడిపోతె మరణం సంభవిస్తుంది.శరీరం నశించినా కూడా ఆత్మ అలాగే వుంటుంది.
9.ప్రశ్న.నాకు సన్నిహితమైన వ్యక్తి చనిపోయాడు.ప్రేమాభిమానాలతో మరిచిపోలేకపోతున్నా.ఎలా?
జవాబు..మనం కొత్తబట్టలు కుట్టించుకుని తొడుక్కుంటాం.చినిగిన తరువాత వదలి మళ్ళీ కొత్తవి వేసుకుంటాము.ఆత్మ కూడా కొన్నాళ్ళు శరీరం లో వుండి,ఆ తరువాత వదలి కొత్త శరీరంలోకి వెల్తుంది..వాడు నాకు దగ్గర,దూరం అని నీ మనసుతో కల్పించుకున్నావు..అంతే..
10.ప్రశ్న...భూమి,నీళ్ళు,అగ్ని,గాలి..వీటి ప్రభావం మన శరీరం పైన వుంటుంది కదా? ఆత్మ పైన కూడా వీటి ప్రభావం వుంటుందా?
జవాబు..ఆత్మను ఇవేవి ఏమీ చేయలేవు.ఆత్మ నిత్యం. ఆత్మను నరకలేము,తగలపెట్టలేము,తడపలేము,ఎండించలేము..అది పర్మనెంట్.శరీరంతో ఆత్మను పోల్చలేము.
(భగవద్గీతలో 2వ అధ్యాయం లో 18,19,20,22,23,24 శ్లోకాల ద్వారా కృష్ణుడు,అర్జునినికి చెప్తాడు).
- అప్పాల ప్రసాద్.
(భగవద్గీతలో 2వ అధ్యాయం లో 18,19,20,22,23,24 శ్లోకాల ద్వారా కృష్ణుడు,అర్జునినికి చెప్తాడు).
ReplyDelete