Breaking News

భగవద్గీత-5


(లూ)

ప్రశ్న.46..ప్రపంచంలో అగ్నిహోత్రుడు,గంగానది పవిత్రమైనవంటారు.ఇంకేమైనా వున్నాయా?

జవాబు..జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదు.అది అబ్యసించి నీ ఆత్మలోనే పొందగలవౌ.

ప్రశ్న.47..వాడికి జ్ఞానం లేదు.శ్రద్ధ లేదు.బుద్ధి లేదు.వాడికి అనుమానాలెక్కువ..వాడి గతేమిటి?

జవాబు..అటువంటివాడు పరలోకంలో కూడా సుఖపడడు.సమాజానికి కూడా సుఖం ఇవ్వడు.ఈ అవలక్షణాలు పోగొట్టాలి.

ప్రశ్న.48..యోగులు,పరమహంసలు కూడా నిత్య వ్యవహారాలు ఎందుకు చేస్తారు?

జవాబు..ఆసక్తి,కోరికలను వదలి ఆ పనులు చేస్తారు.ఆ అవసరం లేకున్నా ఆత్మశోధనకోసం చేస్తారు.

ప్రశ్న..49..ఆ జ్ఞానులు పనులు చేస్తున్నా కూడా శాంతిగా ఎలా వుంటారు? మేము ఎందుకు వుండలేము?

జవాబు..సమభావం గలవారు..అనాసక్తి గలవారు కర్మ బంధం లో చిక్కుకోరు. నీవు చిక్కుకుంటే అశాంతిని పొందుతావు.

ప్రశ్న..50..ఇది నేనే సాధించాను అని కొందరు గొప్పలు చెప్పుకుంటారు.మనం స్వతంత్రంగా ఏదైనా చేయగలమా?

జవాబు..చేయలేము..ఫలితం కూడా మన ప్రయత్నాలపై ఆధారపడి రాదు.ప్రకృతిని బట్టి ప్రారబ్ద్ధాన్ని బట్టి వస్తుంది.

(భగవద్గీతలోని 4వ అధ్యాయంలోని 36,38,40 అలాగే 5వ అధ్యాయం లోని 11,12,14 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి ఈ విధంగా వివరిస్తాడు).
- అప్పాల ప్రసాద్.

2 comments:

  1. (భగవద్గీతలోని 4వ అధ్యాయంలోని 36,38,40 అలాగే 5వ అధ్యాయం లోని 11,12,14 శ్లోకాల ద్వారా కృష్ణుడు అర్జునునికి ఈ విధంగా వివరిస్తాడు).

    ReplyDelete